Telugu Global
NEWS

బాబు రాజకీయంతో.... ఎన్నికలకు ముందే ఓడిన కాంగ్రెస్ సీనియర్లు!

వాళ్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు. దశాబ్దాలుగా కాంగ్రెస్ తో అనుబంధం ఉన్న వాళ్లు. కాంగ్రెస్ తరఫున చంద్రబాబుతో గట్టిగా పోరాడిన నేపథ్యం కూడా ఉంది వారికి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వెళ్లి చంద్రబాబుతో చేతులు కలిపింది కదా…. ఈ నేపథ్యంలో కొందరు కాంగ్రెస్ నేతలకు చంద్రబాబు మార్కు రాజకీయంతో దెబ్బ పడింది. కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో కొంతమంది సీనియర్లకు నియోజకవర్గాలు ఖరారు కాని సంగతి తెలిసిందే. వారిలో సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి, మరో […]

బాబు రాజకీయంతో.... ఎన్నికలకు ముందే ఓడిన కాంగ్రెస్ సీనియర్లు!
X

వాళ్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు. దశాబ్దాలుగా కాంగ్రెస్ తో అనుబంధం ఉన్న వాళ్లు. కాంగ్రెస్ తరఫున చంద్రబాబుతో గట్టిగా పోరాడిన నేపథ్యం కూడా ఉంది వారికి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వెళ్లి చంద్రబాబుతో చేతులు కలిపింది కదా…. ఈ నేపథ్యంలో కొందరు కాంగ్రెస్ నేతలకు చంద్రబాబు మార్కు రాజకీయంతో దెబ్బ పడింది.

కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో కొంతమంది సీనియర్లకు నియోజకవర్గాలు ఖరారు కాని సంగతి తెలిసిందే. వారిలో సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి, మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వారే జూబ్లీ హిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణు, ఎల్బీ నగర్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. వీళ్లంతా కాంగ్రెస్ పార్టీలో పాతుకుపోయిన నేతలు.

వీరి నియోజకవర్గాల్లో పార్టీలో వీరికి పోటీనే లేదు. అయినా కూడా వీళ్లకు సీట్లు ఖరారు కాకపోవడం విశేషం.

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇలా ఎందుకు చేసిందంటే, అది అధిష్టానం పని కాదు.. చంద్రబాబు పని అనే మాట వినిపిస్తోంది.

ఈ ముగ్గురు నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో టీడీపీ అధినేత వేరే వ్యూహాలతో ఉన్నాడు. అందుకే వీరికి సీట్లు దక్కడం లేదని వార్తలు వస్తున్నాయి.

ముందుగా.. మర్రి శశిధర్ రెడ్డి విషయానికి వస్తే.. ఆయన సీనియారిటీ ఏమిటో చెప్పనక్కర్లేదు. సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యేగా అక్కడ పోటీ చేయాలని ఆయన భావిస్తున్నాడు. అయితే అక్కడ చంద్రబాబు నాయుడు కూన వెంకటేశం గౌడ్ ను బరిలోకి దించాలని చూస్తున్నాడట. వీలైతే టీడీపీ తరఫున లేకపోతే కాంగ్రెస్ టికెట్ తో ఆయన పోటీ చేయవచ్చని సమాచారం. దీంతో శశిధర్ రెడ్డి వంటి సీనియర్ కు ఝలక్ తగిలిందట.

ఇక విష్ణు జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేయాలని అనుకున్నాడు. అయితే అక్కడ కమ్మ అభ్యర్థి బరిలో నిలవాలని చంద్రబాబు అనుకున్నాడట. దీంతో విష్ణుకు కూడా బుధవారం వరకు టికెట్ ఖరారు కాలేదు. అలాగే ఎల్బీ నగర్ లో కూడా తను చెప్పిన అభ్యర్థినే నిలబెట్టాలని చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ క్యాండిడేట్ గా సుధీర్ రెడ్డి పేరును పక్కన పెట్టమన్నాడట. ఈ విధంగా చంద్రబాబు కనుసన్నల్లో రూపొందిన జాబితా కావడంతో కాంగ్రెస్ సీనియర్లకు ఝలక్ తగిలిందని తెలుస్తోంది.

First Published:  14 Nov 2018 12:45 PM IST
Next Story