Telugu Global
Cinema & Entertainment

కాబోయే స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్  ?

నిధి అగర్వాల్ ఈ మధ్య కుర్రకారుకి పిచ్చెక్కిస్తున్న పేరు. ఇటీవలే నాగ చైతన్య తో “సవ్యసాచి” మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. సినిమా ఫలితాన్ని పక్కన పెడితే … తన నటన, అందం తో అందరి మనసుల్ని దోచేసింది ఈ భామ. సినిమా ప్లాప్ అయినప్పటికీ నిధి అగర్వాల్ మాత్రం తన పరంగా 100% న్యాయం చేసింది. రివ్యూస్ అన్నింటిలో నిధి గురించే టాపిక్స్. తన డాన్స్ తో, నటన మరియు అందంతో కూడా […]

కాబోయే స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్  ?
X

నిధి అగర్వాల్ ఈ మధ్య కుర్రకారుకి పిచ్చెక్కిస్తున్న పేరు. ఇటీవలే నాగ చైతన్య తో “సవ్యసాచి” మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.

సినిమా ఫలితాన్ని పక్కన పెడితే … తన నటన, అందం తో అందరి మనసుల్ని దోచేసింది ఈ భామ. సినిమా ప్లాప్ అయినప్పటికీ నిధి అగర్వాల్ మాత్రం తన పరంగా 100% న్యాయం చేసింది. రివ్యూస్ అన్నింటిలో నిధి గురించే టాపిక్స్. తన డాన్స్ తో, నటన మరియు అందంతో కూడా తన వంతు న్యాయం తను చేసింది.

నిధి అగర్వాల్ కి తెలుగు లో మంచి ఫ్యూచర్ ఉందని బయట టాక్ .రాబోయే కాలంలో చాలా పెద్ద సినిమాలలో ఆఫర్స్ వస్తాయని అందరూ అనుకుంటున్నారు. ఇదే నిజమైతే నిధి అగర్వాల్ తెలుగులో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఇప్పటికే ప్రొడ్యూసర్స్ ఈమె తో సినిమా లు చెయ్యడానికి రెడీ గా ఉన్నారని సమాచారం. అక్కినేని ఫ్యామిలీ హీరో తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ ఇప్పుడు మళ్లీ అక్కినేని హీరోతోనే జత కడుతోంది. అవును నిధి అగర్వాల్ హీరోయిన్ గా ఇప్పుడు తాజాగా తెరకెక్కుతున్న చిత్రం అఖిల్ అక్కినేని మూవీ “మిస్టర్ మజ్ను”. మొత్తానికి తోలి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకొని తెలుగు ఇండస్ట్రీ లో గ్లామర్ హీరోయిన్ గా ఎదగడానికి రెడీ అవుతుంది ఈ ఇరవై అయిదేళ్ళ భామ.

First Published:  12 Nov 2018 10:49 PM GMT
Next Story