Telugu Global
NEWS

సీపీఐకి మూడే సీట్లు ! ఇవాళే ప్ర‌క‌ట‌న !

కూట‌మి సీట్ల‌లో క్లారిటీ వ‌స్తోంది. ఇప్ప‌టికే కాంగ్రెస్ 65 మంది లిస్ట్‌ను ప్ర‌క‌టించింది. ఇందులో సీపీఐ, టీజేఎస్ కోరుతున్న సీట్ల‌లో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. సీపీఐ కోరుతున్న మునుగోడు, కొత్త‌గూడెంలో అభ్య‌ర్థుల‌ను దించింది. మునుగోడులో కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి, కొత్త‌గూడెంలో వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావు పోటీ చేస్తున్నారు. దీంతో సీపీఐకి ఏఏ సీట్లు ఇస్తార‌నే విష‌యంపై ఉత్కంఠ కొన‌సాగుతోంది. సీపీఐ కేంద్ర క‌మిటీతో కుదిరిన ఒప్పందం ప్ర‌కారం సీపీఐకి మూడు సీట్లకు అంగీకారం కుదిరింది. మూడు సీట్ల‌తో పాటు రెండు ఎమ్మెల్సీల‌కు […]

సీపీఐకి మూడే సీట్లు ! ఇవాళే ప్ర‌క‌ట‌న !
X

కూట‌మి సీట్ల‌లో క్లారిటీ వ‌స్తోంది. ఇప్ప‌టికే కాంగ్రెస్ 65 మంది లిస్ట్‌ను ప్ర‌క‌టించింది. ఇందులో సీపీఐ, టీజేఎస్ కోరుతున్న సీట్ల‌లో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. సీపీఐ కోరుతున్న మునుగోడు, కొత్త‌గూడెంలో అభ్య‌ర్థుల‌ను దించింది. మునుగోడులో కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి, కొత్త‌గూడెంలో వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావు పోటీ చేస్తున్నారు. దీంతో సీపీఐకి ఏఏ సీట్లు ఇస్తార‌నే విష‌యంపై ఉత్కంఠ కొన‌సాగుతోంది.

సీపీఐ కేంద్ర క‌మిటీతో కుదిరిన ఒప్పందం ప్ర‌కారం సీపీఐకి మూడు సీట్లకు అంగీకారం కుదిరింది. మూడు సీట్ల‌తో పాటు రెండు ఎమ్మెల్సీల‌కు సీపీఐ జాతీయ క‌మిటీ ఒప్పుకున్న‌ట్లు తెలిసింది. ఎన్నిక‌ల పొత్తుకు జాతీయ క‌మిటీ సూత్ర‌ప్రాయంగా అంగీకరించార‌ని స‌మాచారం.

హుస్నాబాద్‌- చాడ వెంక‌ట‌రెడ్డి
వైరా- విజ‌య
బెల్లంప‌ల్లి- గుండా మ‌ల్లేష్‌

ఈమూడు సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ఇవాళ ప్ర‌క‌టించ‌బోతున్నారు. సీపీఐ రాష్ట్ర కమిటీ సమావేశం త‌ర్వాత ఈ మూడు సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను అధికారికంగా ప్ర‌క‌టిస్తార‌ని తెలుస్తోంది.

First Published:  13 Nov 2018 4:05 AM IST
Next Story