ఊళ్ళ పేర్లు మార్చే ముందు మీ పేరు మార్చుకోండి
బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక భారతదేశంలో కనీసం 25 ఊళ్ళ పేర్లను మార్చారు. ఇప్పుడు మరెన్నో ఊళ్ళ పేర్లను మార్చడానికి సిద్ధమవుతున్నారు. ఊళ్ళ పేర్లను మార్చడం ఇక ఒక ఉద్యమంలా సాగేటట్టు ఉంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ ఆగ్రా, ముజ్‌ఫర్ నగర్ తదితర పేర్లను మారుస్తానంటున్నాడు. యోగీ లాగే కాషాయం కట్టుకున్న తానూ ముఖ్యమంత్రి అవుతానని కలలు కంటున్న స్వామీ పరిపూర్ణానంద తాను అధికారంలోకి వస్తే తెలంగాణలో చాలా ఊర్ల పేర్లు మారుస్తానంటున్నాడు. ఈ నేపథ్యంలో […]
బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక భారతదేశంలో కనీసం 25 ఊళ్ళ పేర్లను మార్చారు. ఇప్పుడు మరెన్నో ఊళ్ళ పేర్లను మార్చడానికి సిద్ధమవుతున్నారు. ఊళ్ళ పేర్లను మార్చడం ఇక ఒక ఉద్యమంలా సాగేటట్టు ఉంది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ ఆగ్రా, ముజ్‌ఫర్ నగర్ తదితర పేర్లను మారుస్తానంటున్నాడు. యోగీ లాగే కాషాయం కట్టుకున్న తానూ ముఖ్యమంత్రి అవుతానని కలలు కంటున్న స్వామీ పరిపూర్ణానంద తాను అధికారంలోకి వస్తే తెలంగాణలో చాలా ఊర్ల పేర్లు మారుస్తానంటున్నాడు.
ఈ నేపథ్యంలో ప్రముఖ చరిత్రకారుడు, ఫ్రొఫెసర్ ఇర్ఫాన్ హబీబ్ అమిత్ షాకు ఒక సలహా ఇచ్చాడు. దేశంలో పట్టణాల పేర్లు మార్చే ముందు…. ముందు మీ పేరు మార్చుకోండి. మీ పేరు చివర ఉండే ‘షా’ అనే పదం సంస్కృత పదం కాదు. పర్షియన్ పదం. ఊర్ల పేర్లకే ఇతరుల పదాలు వద్దనుకున్నప్పుడు… మీ పేరులో మాత్రం పర్షియన్ పదం ఎందుకు? ముందు మీ పేరు మార్చుకోండి అని సలహా ఇచ్చాడు..
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా అమిత్ షా ఇంటి పేరుని ముందు మార్చుకొని తరువాత ఊళ్ళ పేర్ల మార్పు గురించి ఆలోచించమని సూచించాడు.