Telugu Global
NEWS

జగన్‌ భద్రతకు ప్రత్యేక చర్యలు

వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర తిరిగి ప్రారంభమైంది. విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం తర్వాత గాయం కారణంగా తాత్కాలికంగా యాత్రను వాయిదా వేసుకున్న జగన్‌… తిరిగి  విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని పాయనపాడు నుంచి జగన్‌ పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది.  హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో జగన్‌ భద్రతను కట్టుదిట్టం చేశారు. జగన్‌ పాదయాత్రలో ప్రత్యేకంగా సీసీ కెమెరాలను వైసీపీ ఏర్పాటు చేసింది. జగన్‌ చుట్టూ మూడంచెల భద్రతను పోలీసులు ఏర్పాట్లు చేశారు. జగన్‌కు సమీపంగా ఉండేవారికి మూడు […]

జగన్‌ భద్రతకు ప్రత్యేక చర్యలు
X

వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర తిరిగి ప్రారంభమైంది. విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం తర్వాత గాయం కారణంగా తాత్కాలికంగా యాత్రను వాయిదా వేసుకున్న జగన్‌… తిరిగి విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని పాయనపాడు నుంచి జగన్‌ పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది. హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో జగన్‌ భద్రతను కట్టుదిట్టం చేశారు.

జగన్‌ పాదయాత్రలో ప్రత్యేకంగా సీసీ కెమెరాలను వైసీపీ ఏర్పాటు చేసింది. జగన్‌ చుట్టూ మూడంచెల భద్రతను పోలీసులు ఏర్పాట్లు చేశారు. జగన్‌కు సమీపంగా ఉండేవారికి మూడు రకాల ఐడీ కార్డులను జారీ చేశారు పోలీసులు. రోప్‌ పార్టీతో పాటు, పోలీసు సిబ్బంది అందరికీ గ్రీన్‌ కార్డులను తప్పనిసరి చేశారు. జగన్‌తో పాటు ఉండే పార్టీ లీడర్లకు, మీడియాకు ఎరుపు రంగు కార్డులను అందజేశారు.

ఇక పాదయాత్ర తొలి నుంచి జగన్‌తో పాటుగా కొందరు అభిమానులు పాదయాత్రలో పాల్గొంటున్నారు. వారికి బ్లూకార్డులను పోలీసులు అందజేశారు. జగన్‌ భద్రత దృష్టా తీసుకునే చర్యలను అభిమానులు కూడా అర్ధం చేసుకుని సహకరించాలని ఆ పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు.

First Published:  12 Nov 2018 4:02 AM IST
Next Story