రాములమ్మ మళ్లీ అలిగారా?
కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి అలియాస్ రాములమ్మ కనిపించడం లేదు. నెలరోజుల కిందట వరుసగా మూడు రోజులు ప్రచారం చేశారు. ఆమె ప్రసంగాలకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. కానీ తర్వాత విజయశాంతి కనిపించకుండా పోయారు. విజయశాంతి మళ్లీ ఎందుకు సైలెంట్ అయ్యారు? ప‌్రచార సభలు లేకపోవడంతో ఆమె మళ్లీ ఇంటికి పరిమితమయ్యారా? లేక ఆమె పోటీ చేయాలని సీటు ఆశిస్తే ఎవరైనా అడ్డుపడ్డారా? అనేది ఇప్పుడు కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ […]
కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి అలియాస్ రాములమ్మ కనిపించడం లేదు. నెలరోజుల కిందట వరుసగా మూడు రోజులు ప్రచారం చేశారు. ఆమె ప్రసంగాలకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. కానీ తర్వాత విజయశాంతి కనిపించకుండా పోయారు.
విజయశాంతి మళ్లీ ఎందుకు సైలెంట్ అయ్యారు? ప‌్రచార సభలు లేకపోవడంతో ఆమె మళ్లీ ఇంటికి పరిమితమయ్యారా? లేక ఆమె పోటీ చేయాలని సీటు ఆశిస్తే ఎవరైనా అడ్డుపడ్డారా? అనేది ఇప్పుడు కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ ఇంకా రాలేదు. అయితే గతంలో మెదక్ ఎంపీగా పోటీ చేసిన విజయశాంతి ఈ సారి అదే స్థానం నుంచి అసెంబ్లీ బరిలో ఉంటారని ప్రచారం జరిగింది. లీకైన లిస్ట్‌లో ఆమె పేరు కూడా ఉంది. దీంతో పాటు దుబ్బాక స్థానం టీజేఎస్‌కు ఇవ్వొద్దని ఆమె డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె పోటీ చేయకుండా ఎవరో పావులు కదిపారని కాంగ్రెస్‌లో ఓ టాక్ నడుస్తోంది. దీంతో ఆమె మనస్తాపం చెంది ఇంటికే పరిమితమయ్యారని ఓ ప్రచారం నడుస్తోంది.
కాంగ్రెస్ ప్రచార కమిటీ మూడు రోజుల పాటు ప్రచారం నిర్వహించింది. ఆ తర్వాత రాహుల్ టూర్ కోసం విరామం ప్రకటించింది. నెల రోజులైనా మళ్లీ క్యాంపెయిన్ ప్రారంభం కాలేదు. ఇక్కడ విజయశాంతి అసహనానికి గురైనట్లు ప్రచారం నడుస్తోంది. విజయశాంతి పంచ్‌లకు జనం నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆమె ప్రచారం ఇలాగే కొనసాగితే తమకు ఇబ్బంది అని భావించిన నేతలు…. ఇలా ఆమెను సైడ్ చేశారని గుసగుసలాడుతున్నారు.
అయితే అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో ప్రచారం ఆపాల్సి వచ్చిందని… కాంగ్రెస్ జాబితా రాగానే సుడిగాలి ప్రచారం మళ్లీ మొదలు పెడతామని కాంగ్రెస్ లోని మరో వర్గం నేతలు అంటున్నారు.