Telugu Global
CRIME

విజయవాడలో మహిళపై యువకుల పైశాచికం

స్వల్ప వివాదం…. ఆ యువకులను దుర్మార్గులుగా మార్చింది. నిర్భయ ఘటనను తలపించేలా జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ జననాంగంలోకి కట్టెలను పెట్టిన దుర్మార్గులు రాక్షసానందం పొందారు. సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. కృష్ణాజిల్లా ముసునూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ ఇంటి పక్కనే కుంపటి రాజు, అంజయ్యల ఇల్లు ఉంది. ఇంటి స్థలం విషయమై గొడవలు జరుగుతున్నాయి. నవంబర్ 1 వ తేదీన వీరి […]

విజయవాడలో మహిళపై యువకుల పైశాచికం
X

స్వల్ప వివాదం…. ఆ యువకులను దుర్మార్గులుగా మార్చింది. నిర్భయ ఘటనను తలపించేలా జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ జననాంగంలోకి కట్టెలను పెట్టిన దుర్మార్గులు రాక్షసానందం పొందారు. సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.

కృష్ణాజిల్లా ముసునూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ ఇంటి పక్కనే కుంపటి రాజు, అంజయ్యల ఇల్లు ఉంది. ఇంటి స్థలం విషయమై గొడవలు జరుగుతున్నాయి. నవంబర్ 1 వ తేదీన వీరి మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి రాజు, అంజయ్య మరింత కక్ష పెంచుకున్నారు. గురువారం ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు వారిద్దరూ ఆమె దగ్గరకు వెళ్లారు. తలుపులు వేసి హింసించడం మొదలుపెట్టారు. ఫిర్యాదు ఇస్తావా అంటూ ఇష్టమొచ్చినట్టు తిట్టి కొట్టారు. అక్కడే ఉన్న ఓ కర్రతో దాడి చేశారు.

ఆమె కిందపడి స్పృహ కోల్పోయింది. రాజు, అంజయ్యలు ఆ మహిళ కింద పడగానే ఆమె జననాంగంలోకి చేతిలో ఉన్న కర్రను తోపి రాక్షసానందం పొందారు. ఆమెను శరీరమంతా ఇష్టమొచ్చినట్టు గిచ్చుతూ ఆనందించారు. వారు పెట్టే హింసకు మహిళ అరవడంతో చుట్టు పక్కల వాళ్లు అక్కడకు చేరుకున్నారు. వారిని చూసిన రాజు, అంజయ్యలు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న మహిళను గ్రామస్థులు నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి చేరుకుని ఫిర్యాదు తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పారు. నిందితులు పరారీలో ఉన్నారు. త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

కాగా ఈ ఘటన పై మహిళా సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు నిరసన తెలిపారు. మహిళలకు రక్షణ కరువైందని, నిర్భయ ఘటనను తలపించిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ముసునూరు పోలీసులు స్పందిస్తూ.. ఇంటి పక్క స్థల వివాదం కావడంతో ముందుగా పెద్ద మనుషులలో పెట్టి మాట్లాడుకోవాలని సూచించామని అన్నారు. వారంలోగా పరిష్కరించుకుంటామని చెప్పారని, నిందితులు ఇంత ఘోరానికి తెగబడుతారనుకోలేదని పోలీసులు తెలిపారు. చట్ట ప్రకారం చర్య తీసుకొని శిక్ష పడేలా చేస్తామన్నారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి చేరుకుని ఫిర్యాదు తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పారు. నిందితులు పరారీలో ఉన్నారు. త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

కాగా ఈ ఘటన పై మహిళా సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు నిరసన తెలిపారు. మహిళలకు రక్షణ కరువైందని, నిర్భయ ఘటనను తలపించిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ముసునూరు పోలీసులు స్పందిస్తూ.. ఇంటి పక్క స్థల వివాదం కావడంతో ముందుగా పెద్ద మనుషులలో పెట్టి మాట్లాడుకోవాలని సూచించామని అన్నారు.

వారంలోగా పరిష్కరించుకుంటామని చెప్పారని, నిందితులు ఇంత ఘోరానికి తెగబడుతారనుకోలేదని పోలీసులు తెలిపారు. చట్ట ప్రకారం చర్య తీసుకొని శిక్ష పడేలా చేస్తామన్నారు.

First Published:  12 Nov 2018 6:20 AM IST
Next Story