Telugu Global
NEWS

ప్యారాచూట్ అభ్యర్థులపై రాహుల్ సీరియస్‌

తెలంగాణలో మహాకూటమి సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కిరావడం లేదు. రేపు… ఎల్లుండి… అంటూ కాలయాపన జరుగుతోందే గానీ… నామినేషన్ దాఖలు సమయం వచ్చినా జాబితా మాత్రం విడుదల కాలేదు. ఈ పరిణామంతో కాంగ్రెస్‌ శ్రేణులు నిరుత్సాహానికి లోనవుతున్నారు. టీఆర్‌ఎస్ తన అభ్యర్థులను ప్రకటించి దూసుకెళ్తుంటే మహాకూటమి అంటూ కనీసం అభ్యర్థులను కూడా ప్రకటించలేకపోతున్నారని వాపోతున్నారు. ఈ పరిణామంపై రాహుల్ గాంధీ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. సీట్ల సర్దుబాట్లలో ఆలస్యంపై అసహనం వ్యక్తం చేశారు. నేరుగా తానే […]

ప్యారాచూట్ అభ్యర్థులపై రాహుల్ సీరియస్‌
X

తెలంగాణలో మహాకూటమి సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కిరావడం లేదు. రేపు… ఎల్లుండి… అంటూ కాలయాపన జరుగుతోందే గానీ… నామినేషన్ దాఖలు సమయం వచ్చినా జాబితా మాత్రం విడుదల కాలేదు. ఈ పరిణామంతో కాంగ్రెస్‌ శ్రేణులు నిరుత్సాహానికి లోనవుతున్నారు. టీఆర్‌ఎస్ తన అభ్యర్థులను ప్రకటించి దూసుకెళ్తుంటే మహాకూటమి అంటూ కనీసం అభ్యర్థులను కూడా ప్రకటించలేకపోతున్నారని వాపోతున్నారు.

ఈ పరిణామంపై రాహుల్ గాంధీ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. సీట్ల సర్దుబాట్లలో ఆలస్యంపై అసహనం వ్యక్తం చేశారు. నేరుగా తానే రంగంలోకి దిగారు. పీసీసీ చీఫ్‌తో పాటు స్క్రీనింగ్ కమిటీ సభ్యులను తన నివాసానికి పిలిపించుకుని రెండు సార్లు చర్చలు జరిపారు.

ఇదే సమయంలో ఇప్పటికే సిద్ధం చేసిన 74 మంది అభ్యర్థుల జాబితాలో దాదాపు 10 నుంచి 15 మందిపై తీవ్ర స్థాయిలో ఫిర్యాదులు రాహుల్‌కు అందాయి. ఇటీవలే పార్టీలోకి వచ్చిన ప్యారాచూట్ అభ్యర్థులు కొందరు పెద్దల సాయంతో టికెట్లు సొంతం చేసుకున్న వైనాన్ని బాధిత నేతలు సాక్ష్యాలతో సహా రాహుల్‌కు అందజేశారు.

కనీసం కాంగ్రెస్ సభ్యత్వం లేని వారు కూడా టికెట్లు సొంతం చేసుకుంటున్న విషయాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్యారాచూట్ అభ్యర్థులపై దృష్టి పెట్టిన రాహుల్‌… వారు ఎప్పుడు పార్టీలో చేరారు… ఏఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారు…. సర్వే రిపోర్టులు ఏం చెబుతున్నాయి వంటి ఆధారాలన్నీ సమర్పించాలని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ను రాహుల్‌ ఆదేశించారు. మొత్తం మీద కాంగ్రెస్ జాబితా సోమవారం కూడా విడుదల కాలేదు.

First Published:  12 Nov 2018 4:08 PM IST
Next Story