ఎడారిలో నివాసం
ఒక వివేకవంతుడు ఏదో పని మీద బయల్దేరాడు. మార్గమధ్యంలో ఒక ఎడారిని దాటాల్సి వచ్చింది. కొన్ని గంటలు ప్రయాణిస్తే అతను ఎడారిని దాటవచ్చు. మార్గమధ్యలో అవసరమయి సరంజామాని కూడా ముందు జాగ్రత్తగా తీసుకొచ్చాడు. ఎడాది మార్గంలో వెళుతున్నాడు. ఆ ఎడారిలో అతనికి ఒక సన్యాసి ఎదురుపడ్డాడు. అతను ఆ సన్యాసిని చూసి ఆశ్చర్యపోయాడు. అంత నిర్జన ప్రదేశంలో ఒక గుడారం వేసుకుని ఆ సన్యాసి వుండడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వివేకి ‘నువ్వు ఎక్కడుంటావు’ అన్నాడు. సన్యాసి ‘నేను […]
BY Pragnadhar Reddy12 Nov 2018 2:30 PM IST
X
Pragnadhar Reddy Updated On: 24 Oct 2018 4:45 PM IST
ఒక వివేకవంతుడు ఏదో పని మీద బయల్దేరాడు. మార్గమధ్యంలో ఒక ఎడారిని దాటాల్సి వచ్చింది. కొన్ని గంటలు ప్రయాణిస్తే అతను ఎడారిని దాటవచ్చు. మార్గమధ్యలో అవసరమయి సరంజామాని కూడా ముందు జాగ్రత్తగా తీసుకొచ్చాడు. ఎడాది మార్గంలో వెళుతున్నాడు. ఆ ఎడారిలో అతనికి ఒక సన్యాసి ఎదురుపడ్డాడు. అతను ఆ సన్యాసిని చూసి ఆశ్చర్యపోయాడు. అంత నిర్జన ప్రదేశంలో ఒక గుడారం వేసుకుని ఆ సన్యాసి వుండడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వివేకి 'నువ్వు ఎక్కడుంటావు' అన్నాడు. సన్యాసి 'నేను ఈ ఎడారిలోనే నివాసముంటాను' అన్నాడు. వివేకి ఆశ్చర్యపోయాడు. జనావాసాలకు దూరంగా ఒంటరిగా సన్యాసి వుండడం ఆశ్చర్యాన్ని కలిగించింది. 'నువ్వు ఒంటరిగా అందరికీ దూరంగా వుండడానికి కారణమేమిటి?' అని అడిగాడు. సన్యాసి ''నేను నా విశ్వాసానికి అనుగుణంగా జీవిస్తే జనాలు నా పట్ల సందేహం ప్రకటించారు. పైగా వాళ్ళందరూ నాకన్నా పవిత్రమయిన జీవితం గడుపుతున్నట్లు భావించసాగారు. అట్లా అని వాళ్ళు తప్పుచేశామని అనుకోలేదు. పైగా నా ఏకాంతానికి ఆటంకం కలిగిస్తున్నారు.'' తమ అహంకారంతో నన్ను అడ్డుకున్నారు. నా మనసు గాయ పరిచారు' అన్నాడు. వివేకి సన్యాసి చెప్పిందంతా విని 'నీ సమస్య ఏమిటంటే నువ్వు నువ్వుగా వుండడానికి ప్రయత్నించడంలేదు. అట్లాగే జనాలు ఎట్లావున్నారో వాళ్ళని అట్లా ఆమోదించడానికీ సిద్ధంగా లేవు. నువ్వు ఈ రకంగా వుంటే నిజానికి నువ్వు ఎడారిలో వుండడమే మేలు' అన్నారు. - సౌభాగ్య
Next Story