గ్రేటర్ పరిధిలో మహాకూటమికి జీరో.... 100కుపైగా టీఆర్‌ఎస్‌కే
అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపును అడ్డుకోవడం ఎవరి వల్లా కాదని ఆపద్దర్మ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ భవన్‌లో అభ్యర్థులకు బీ-ఫాంలు పంపిణి చేసిన కేసీఆర్…. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌కు మహాకూటమి దరిదాపుల్లో కూడా లేదన్నారు. వందకు పైగా స్థానాల్లో టీఆర్‌ఎస్ సునాయాసంగా గెలుస్తుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎంఐఎం పోటీ చేసే స్థానాలు మినహా మొత్తం స్థానాలు టీఆర్‌ఎస్ గెలుస్తుందని వివరించారు. ఏసర్వే చూసినా […]
అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపును అడ్డుకోవడం ఎవరి వల్లా కాదని ఆపద్దర్మ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ భవన్‌లో అభ్యర్థులకు బీ-ఫాంలు పంపిణి చేసిన కేసీఆర్…. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌కు మహాకూటమి దరిదాపుల్లో కూడా లేదన్నారు.
వందకు పైగా స్థానాల్లో టీఆర్‌ఎస్ సునాయాసంగా గెలుస్తుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎంఐఎం పోటీ చేసే స్థానాలు మినహా మొత్తం స్థానాలు టీఆర్‌ఎస్ గెలుస్తుందని వివరించారు. ఏసర్వే చూసినా టీఆర్‌ఎస్‌కు భారీగా అధిక్యం ఉన్నట్టుగా స్పష్టంగా చెబుతున్నాయన్నారు.
ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ఎవరన్నది చూడకుండా పనిచేసుకుపోవాలని టీఆర్‌ఎస్ అభ్యర్థులకు సూచించారు. భారీ మెజారిటీలతో అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 15 నుంచి తాను ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటానని చెప్పారు. దాదాపు 70 నుంచి 80 నియోజకవర్గాల్లో పర్యటిస్తానని వివరించారు. డిసెంబర్ 3న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు. అభ్యర్థులకు నిరంతరం తెలంగాణ భవన్‌లోని సమన్వయ కమిటీ అందుబాటులో ఉంటుందని కేసీఆర్ వివరించారు.
మహాకూటమి ఒక విఫల ప్రయోగమేనన్నారు. టీఆర్‌ఎస్ స్పీడ్‌కు భయపడే మహాకూటమి అభ్యర్థులను ప్రకటించే విషయంలో భయపడుతోందన్నారు. మహాకూటమి అభ్యర్థుల జాబితాను విడుదల చేయగానే భారీ సంఖ్యలో మహాకూటమి పార్టీల అసంతృప్త నేతలు టీఆర్‌ఎస్‌లో చేరుతారని కేసీఆర్ వివరించారు.
టీఆర్‌ఎస్ 20 నియోజకవర్గాల్లో పుంజుకోవాల్సి ఉందన్నారు కేసీఆర్. అందుకే ఆయా నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్ లను నియమించినట్లు కేసీఆర్ వెల్లడించారు. కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల పరిస్థితిని కేసీఆర్ వివరించారు.
ఈటల రాజేందర్‌కు నియోజకవర్గంలో 81.64 శాతం ప్రజల మద్దతు ఉండగా… మహాకూటమికి 17.85 శాతమే మాత్రమే ప్రజల మద్దతు ఉందని కేసీఆర్ ఒక సర్వే రిపోర్టును వివరించారు. హుస్నాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు 71.50 శాతం మద్దతు ఉండగా… సిరిసిల్లలో 64.90 శాతం, చొప్పదండిలో 67. 60 శాతం, ధర్మపురిలో 73.72 శాతం, రామగుండంలో 65.73 శాతం, జగిత్యాలలో 45.04 శాతం ప్రజల మద్దతు ఉన్నట్టు కేసీఆర్ రిపోర్టులను వివరించారు.