జెన్నిఫర్ లోపెజ్ ఇంట్లో శ్రీను వైట్ల
పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్ గురించి తెలియని వారుండరు. ప్రపంచవ్యాప్తంగా ఈమెకు అభిమానులున్నారు. అమెరికాలోని ప్రముఖ నగరాల్లో ఆమెకు భవంతులు కూడా ఉన్నాయి. అలాంటి ఓ భవంతిలోకి శ్రీనువైట్ల అడుగుపెట్టాడు. ఏకంగా 20 రోజుల పాటు జెన్నిఫర్ లోపెజ్ కు చెందిన భవనంలోనే గడిపాడు. అమర్ అక్బర్ ఆంటోనీ షూటింగ్ లో భాగంగా జెన్నిఫర్ లోపెజ్ భవంతిని అద్దెకు తీసుకున్నారు. అందులో 20 రోజుల పాటు షూటింగ్ చేశారు. మూవీ ప్రమోషన్ లో భాగంగా ఈ వివరాల్ని […]

పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్ గురించి తెలియని వారుండరు. ప్రపంచవ్యాప్తంగా ఈమెకు అభిమానులున్నారు. అమెరికాలోని ప్రముఖ నగరాల్లో ఆమెకు భవంతులు కూడా ఉన్నాయి. అలాంటి ఓ భవంతిలోకి శ్రీనువైట్ల అడుగుపెట్టాడు. ఏకంగా 20 రోజుల పాటు జెన్నిఫర్ లోపెజ్ కు చెందిన భవనంలోనే గడిపాడు.
అమర్ అక్బర్ ఆంటోనీ షూటింగ్ లో భాగంగా జెన్నిఫర్ లోపెజ్ భవంతిని అద్దెకు తీసుకున్నారు. అందులో 20 రోజుల పాటు షూటింగ్ చేశారు. మూవీ ప్రమోషన్ లో భాగంగా ఈ వివరాల్ని అందరితో షేర్ చేసుకున్నాడు శ్రీనువైట్ల. ఆ భవంతిలో షూట్ చేసిన మొట్టమొదటి తెలుగు సినిమా తమదే అంటున్నాడు.
రవితేజ, ఇలియానా జంటగా నటించిన ఈ సినిమా 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. సినిమాలో జెన్నిఫర్ లోపెజ్ భవనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు మేకర్స్. ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన పాటల్ని జ్యూక్ బాక్స్ రూపంలో విడుదల చేశారు.