కాంగ్రెస్ లో సీట్ల లొల్లి.... ముఖ్య నేతల అసంతృప్తి!
మహాకూటమిలో సీట్ల వ్యవహారం అలా సెటిల్ అయ్యిందో లేదో.. ఇలా కాంగ్రెస్ పార్టీలో సీట్ల లొల్లి మొదలైంది. ఇది ముందుగా ఊహించినదే. సీట్ల వ్యవహారం అలా సెటిల్ కాగానే.. ఇలా టికెట్ల విషయంలో రచ్చ మొదలవుతుందని విశ్లేషకులు అంటూనే ఉన్నారు. ఏ సీటు ఎవరికి అనేదే పెద్ద పంచాయితీ అని…. ఇదే కాంగ్రెస్ ను, మహాకూటమిని దెబ్బ కొడుతుందనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. అదే జరుగుతోందిప్పుడు. తమ అనుచరుడు చిరుమర్తి లింగయ్యకు సీటు ఇవ్వకపోతే తాము పోటీ […]
మహాకూటమిలో సీట్ల వ్యవహారం అలా సెటిల్ అయ్యిందో లేదో.. ఇలా కాంగ్రెస్ పార్టీలో సీట్ల లొల్లి మొదలైంది. ఇది ముందుగా ఊహించినదే. సీట్ల వ్యవహారం అలా సెటిల్ కాగానే.. ఇలా టికెట్ల విషయంలో రచ్చ మొదలవుతుందని విశ్లేషకులు అంటూనే ఉన్నారు. ఏ సీటు ఎవరికి అనేదే పెద్ద పంచాయితీ అని…. ఇదే కాంగ్రెస్ ను, మహాకూటమిని దెబ్బ కొడుతుందనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి.
అదే జరుగుతోందిప్పుడు. తమ అనుచరుడు చిరుమర్తి లింగయ్యకు సీటు ఇవ్వకపోతే తాము పోటీ చేయమని ప్రకటించేశారు కోమటి రెడ్డి సోదరులు. నకిరేకల్ సీటును చిరుమర్తి లింగయ్యకు ఇవ్వాలని.. ఒకవేళ అధిష్టానం అలా చేయని పక్షంలో తను మునుగోడు నుంచి పోటీ చేయనని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించాడు. అలాగే తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా నల్లగొండ నుంచి పోటీ చేయడని రాజగోపాల్ రెడ్డి ప్రకటించేశాడు. ఇలా వారు తమ అసమ్మతిని తెలియజేశారు. అసహనాన్ని వ్యక్తం చేశారు.
ఇక మరోవైపు రేవంత్ రెడ్డి కూడా బాగా అసహనంతో ఉన్నాడట. తను చేరినప్పుడు చేసిన డిమాండ్లకు కాంగ్రెస్ హై కమాండ్ ఓకే అన్నదని ఇప్పుడు మాత్రం నో అంటోందని రేవంత్ విరుచుకుపడుతున్నాడట.
కాంగ్రెస్ లో వ్యవహారం ఇలానే ఉంటుందని రేవంత్ కు తెలిసే ఉండాల్సింది. చేరినప్పుడు ఉండే కథలు వేరు, ఆ తర్వాత కథలు వేరని రేవంత్ ఇప్పుడు అసహనభరితుడు అవుతున్నాడట.
కేవలం వీరు మాత్రమే కాదు.. నామినేషన్ల గడువు ముగిసే వరకూ ఈ రచ్చ, రసవత్తర రాజకీయం కొనసాగే అవకాశం ఉంది. విత్ డ్రాల వరకూ రాజకీయం హాట్ హాట్ గా మారే అవకాశం ఉంది.