Telugu Global
NEWS

కాంగ్రెస్ లిస్ట్ రేపు విడుద‌ల ! తొలి జాబితాలో మ‌ళ్లీ మార్పులు !

కాంగ్రెస్ జాబితా మ‌ళ్లీ వాయిదా ప‌డింది. శ‌నివారం కాదు. ఆదివారం విడుద‌ల కాబోతుంది. తొలి జాబితాలో మ‌ళ్లీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. తొలి జాబితాలో 74 మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తార‌ని తెలిసింది. కేంద్ర ఎన్నిక‌ల క‌మిటీ ఈ అభ్య‌ర్థిత్వాల‌కు ఆమోదం తెలిపింద‌ని….శ‌నివారం ప్ర‌కటిస్తామ‌ని కాంగ్రెస్ నేత‌లు చెప్పారు. అయితే జాబితాలో మార్పులు చేర్పులు చేయాల‌ని నిర్ణ‌యించ‌డంతో విడుద‌ల ఆదివారానికి వాయిదా ప‌డింది. తొలి జాబితాలోని కొన్ని టికెట్లపై వివాదం తలెత్తింది. కొంత గందరగోళం తలెత్తిన నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటనను […]

కాంగ్రెస్ లిస్ట్ రేపు విడుద‌ల ! తొలి జాబితాలో మ‌ళ్లీ మార్పులు !
X

కాంగ్రెస్ జాబితా మ‌ళ్లీ వాయిదా ప‌డింది. శ‌నివారం కాదు. ఆదివారం విడుద‌ల కాబోతుంది. తొలి జాబితాలో మ‌ళ్లీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. తొలి జాబితాలో 74 మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తార‌ని తెలిసింది. కేంద్ర ఎన్నిక‌ల క‌మిటీ ఈ అభ్య‌ర్థిత్వాల‌కు ఆమోదం తెలిపింద‌ని….శ‌నివారం ప్ర‌కటిస్తామ‌ని కాంగ్రెస్ నేత‌లు చెప్పారు. అయితే జాబితాలో మార్పులు చేర్పులు చేయాల‌ని నిర్ణ‌యించ‌డంతో విడుద‌ల ఆదివారానికి వాయిదా ప‌డింది.

తొలి జాబితాలోని కొన్ని టికెట్లపై వివాదం తలెత్తింది. కొంత గందరగోళం తలెత్తిన నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటనను వాయిదా వేశారు. శనివారం మరోమారు ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీతో పీసీసీ ముఖ్యనేతలు సమావేశమై మార్పులపై నిర్ణ‌యం తీసుకుంటారు. పొత్తుల్లో భాగంగా మిత్రపక్షాలకు కేటాయించిన స్థానాలపై కాంగ్రెస్‌ నేతల నుంచి తీవ్రమైన నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది. కొన్ని సీట్లు త‌మ వారికి ఇవ్వాల్సిందేన‌ని నేత‌లు ప‌ట్ట‌బడుతున్నారు. దీంతో తొలి జాబితాలోని కొన్ని పేర్ల‌పై మ‌రోసారి చర్చించాల‌ని నేత‌లు నిర్ణ‌యించార‌ని తెలుస్తోంది.

మ‌హాకూట‌మి పొత్తులో భాగంగా టీడీపీకి 14 సీట్లు, టీజేఎస్‌కు 8, సీపీఐకి మూడు సీట్లు కేటాయించారు. అయితే కూట‌మికి ఇచ్చిన సీట్ల‌తో పాటు త‌మ వారికి టిక్కెట్లు కేటాయించ‌క‌పోవ‌డంతో నేత‌ల నుంచి తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో ఏకపక్షంగా జాబితాను ప్రకటించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తంకావడంతో కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటనను ఒక రోజు వాయిదా వేసినట్లు తెలిసింది. ఇంకా కసరత్తు చేయాల్సిన 20 స్థానాల్లో కూడా స్పష్టత వస్తే తమ పార్టీ పోటీచేసే మొత్తం 94 స్థానాలకు అభ్యర్థులను ఒకేసారి ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌నేత ఒకరు తెలిపారు.

First Published:  9 Nov 2018 8:38 PM GMT
Next Story