13న వైసీపీలోకి సి.రామచంద్రయ్య
మాజీ మంత్రి, ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సీనియర్ నేత సి. రామచంద్రయ్య వైసీపీలో చేరుతున్నారు. ఈనెల 13న ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. శుక్రవారం కడప వచ్చిన ఆయన ఒక వివాహ కార్యక్రమంలో తన సన్నిహితులకు ఈ విషయాన్ని చెప్పారు. దీంతో సి. రామచంద్రయ్య వైసీపీలో చేరిక ఖాయమైపోయినట్టుగా భావిస్తున్నారు. ఏ ప్రతిపాదనతో వైసీపీలో చేరుతున్నారు?.. ఏదైనా హామీ లభించిందా? అన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. చంద్రబాబుతో కాంగ్రెస్ చేతులు కలపడాన్ని నిరసిస్తూ కొద్ది […]

మాజీ మంత్రి, ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సీనియర్ నేత సి. రామచంద్రయ్య వైసీపీలో చేరుతున్నారు. ఈనెల 13న ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. శుక్రవారం కడప వచ్చిన ఆయన ఒక వివాహ కార్యక్రమంలో తన సన్నిహితులకు ఈ విషయాన్ని చెప్పారు. దీంతో సి. రామచంద్రయ్య వైసీపీలో చేరిక ఖాయమైపోయినట్టుగా భావిస్తున్నారు.
ఏ ప్రతిపాదనతో వైసీపీలో చేరుతున్నారు?.. ఏదైనా హామీ లభించిందా? అన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. చంద్రబాబుతో కాంగ్రెస్ చేతులు కలపడాన్ని నిరసిస్తూ కొద్ది రోజుల క్రితమే రామచంద్రయ్య కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. అదే సమయంలో రామచంద్రయ్య వైసీపీ నేతలతో చర్చలు జరిపారు. చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనను సి. రామచంద్రయ్య తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు.