Telugu Global
NEWS

మహిళా టీ-20 ప్రపంచకప్ లో భారత్ టైటిల్ వేట

కరీబియన్ ద్వీపాలు వేదికగా నేటినుంచే వరల్డ్ వార్ హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా భారత్ పోటీ భారత స్టార్ ప్లేయర్లు స్మృతి మంథానా, మిథాలీ, హర్మన్ ప్రీత్ కౌర్ నవంబర్ 9న న్యూజిలాండ్ తో భారత్ ఢీ ధూమ్ ధామ్ టీ-20 ప్రపంచకప్ లో….మహిళల ప్రపంచకప్ కు…కరీబియన్ ద్వీపాలలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. పది అత్యుత్తమ జట్ల మధ్య జరిగే ఈ పోరులో… మాజీ సెమీఫైనలిస్ట్, 5వ ర్యాంకర్ భారత్…డార్క్ హార్స్ హోదాలో తన అదృష్టం పరీక్షించుకొంటోంది. […]

మహిళా టీ-20 ప్రపంచకప్ లో భారత్ టైటిల్ వేట
X
  • కరీబియన్ ద్వీపాలు వేదికగా నేటినుంచే వరల్డ్ వార్
  • హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా భారత్ పోటీ
  • భారత స్టార్ ప్లేయర్లు స్మృతి మంథానా, మిథాలీ, హర్మన్ ప్రీత్ కౌర్
  • నవంబర్ 9న న్యూజిలాండ్ తో భారత్ ఢీ

ధూమ్ ధామ్ టీ-20 ప్రపంచకప్ లో….మహిళల ప్రపంచకప్ కు…కరీబియన్ ద్వీపాలలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. పది అత్యుత్తమ జట్ల మధ్య జరిగే ఈ పోరులో… మాజీ సెమీఫైనలిస్ట్, 5వ ర్యాంకర్ భారత్…డార్క్ హార్స్ హోదాలో తన అదృష్టం పరీక్షించుకొంటోంది.

గ్రూప్ – బీ ప్రారంభ లీగ్ మ్యాచ్ లో రెండో ర్యాంకర్ న్యూజిలాండ్ కు హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత్ సవాల్ విసురుతోంది.

భారత కాలమాన ప్రకారం రాత్రి 8-30 గంటలకు …గయానా నేషనల్ స్టేడియం వేదికగా ఈ పోటీ ప్రారంభమవుతుంది.

కరీబియన్ ద్వీపాలలో….

బౌండ్రీలు…సిక్సర్ల షాట్ల వర్షంతో సాగిపోయే టీ-20 మహిళా ప్రపంచకప్ కు…కరీబియన్ ద్వీపాలలోని గయానా, సెయింట్ లూసియా, ఆంటీగా వేదికలుగా రంగం సిద్ధమయ్యింది.

నవంబర్ 9 నుంచి 24 వరకూ రెండువారాలపాటు సాగే ఈ టోర్నీలో…ప్రపంచ మహిళా క్రికెట్ లోని పది అత్యుత్తమ జట్లు ఢీ కొనబోతున్నాయి.

గ్రూప్ లీగ్ కమ్ సెమీఫైనల్స్ నాకౌట్ గా జరిగే ఈ టోర్నీలో పాల్గొంటున్న మొత్తం 10 జట్లను రెండు గ్రూపులుగా …తొలిదశ పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రపంచ నంబర్ వన్ ఆస్ట్రేలియా, రెండోర్యాంకర్ న్యూజిలాండ్, 7వ ర్యాంకర్ పాకిస్థాన్, 10వ ర్యాంకర్ ఐర్లాండ్ జట్లతో కూడిన గ్రూప్ -బీ లీగ్ బరిలోకి 5వ ర్యాంకర్ భారత్ పోటీకి దిగుతోంది.

హర్మన్ ప్రీత్ నాయకత్వంలో….

సూపర్ హిట్టర్ హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారతజట్టు..ఏకంగా ఆరుగురు యువక్రికెటర్లతో కలసి సమరానికి సిద్ధమయ్యింది.

ఓపెనర్ స్మృతి మంథానాతో పాటు… వెటరన్ మిథాలీ రాజ్, తాన్యా భాటియా, ఏక్తా బిస్త్, హేమలత, మానసీ జోషీ, వేదా కృష్ణమూర్తి, అనూజా పాటిల్, అరుంధతి రెడ్డి, జెమీమా రోడ్రిగేస్, దీప్తి శర్మ, పూజా వస్త్రకర్, రాధాయాదవ్, పూనమ్ యాదవ్ ఇతర సభ్యులుగా ఉన్నారు.

రెండుసార్లు సెమీఫైనలిస్ట్…

2009 ప్రారంభ టీ-20 ప్రపంచకప్ నుంచి పాల్గొంటూ వస్తున్న భారత్ కు అంతంత మాత్రం రికార్డే ఉంది. 2009, 2010 ప్రపంచకప్ టోర్నీల సెమీస్ కు చేరటమే… భారత్ సాధించిన అత్యుత్తమ విజయాలుగా ఉన్నాయి.

ప్రపంచకప్ చరిత్రలో భారత్ ఇప్పటి వరకూ ఆడిన 21 మ్యాచ్ ల్లో 9 విజయాలు, 12 పరాజయాల రికార్డుతో ఉంది.

కివీస్ తో తొలిసమరం

గయానా నేషనల్ స్టేడియం వేదికగా … శుక్రవారం రాత్రి 8-30 గంటలకు ప్రారంభమయ్యే…గ్రూప్- బీ తొలిమ్యాచ్ లోనే భారత్ అతిపెద్ద పరీక్ష ఎదుర్కొనబోతోంది.

రెండుసార్లు ప్రపంచకప్ రన్నరప్, 2వ ర్యాంకర్ న్యూజిలాండ్ ను..హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత యువజట్టు ఢీ కొనబోతోంది. న్యూజిలాండ్ ప్రత్యర్థిగా ఇప్పటి వరకూ ఆడిన మూడు ప్రపంచకప్ మ్యాచ్ ల్లోనూ భారత్ ఒక్క గెలుపు సాధించక పోవడం ఆందోళన కలిగించే అంశమే. నవంబర్ 11న జరిగే రెేండోరౌండ్ పోటీలో 7వ ర్యాంకర్ పాకిస్థాన్ తో భారత్ తలపడుతుంది.

నవంబర్ 15న జరిగే మూడోరౌండ్లో 10వ ర్యాంకర్ ఐర్లాండ్, నవంబర్ 17న జరిగే గ్రూప్ ఆఖరిరౌండ్ లో…టాప్ ర్యాంకర్ ఆస్ట్రేలియా జట్లతో…భారత్ డూ ఆర్ డై సమరం చేయనుంది.

గయానా వేదికగా భారత్ మ్యాచ్ లు

గ్రూప్ లీగ్ లో భారత్ ఆడే మ్యాచ్ లన్నీ…గయానా నేషనల్ స్టేడియం వేదికగానే నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్ లన్నీ ఆయా తేదీలలో రాత్రి 8 గంటల30 నిముషాలకు ప్రారంభమవుతాయి.

అంతేకాదు…తొలిసారిగా మహిళల కోసమే ప్రత్యేకంగా ప్రపంచ కప్ నిర్వహించడంతోపాటు…మ్యాచ్ లన్నింటీని ప్రత్యక్షప్రసారం చేయాలని ఐసీసీ నిర్ణయించింది. అంతేకాదు…తొలిసారిగా DRS విధానాన్ని సైతం అమలు చేయటానికి ఏర్పాట్లు ేచేశారు.

నవంబర్ 22న ఆంటీగా లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా సెమీఫైనల్స్, నవంబర్ 24న ఆంటీగా స్టేడియం వేదికగానే ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు.

భారత మహిళల సత్తాకు సవాల్

ఇప్పటి వరకూ చిన్నజట్లలో పెద్దజట్టుగా ఉన్న భారత్… ప్రపంచ మేటిజట్లలో తామూ ఒకరిమని చాటుకోడానికి ప్రస్తుత టీ-20 ప్రపంచకప్ కు మించిన సువర్ణావకాశం మరొకటిలేదు.

అంతేకాదు.. ఐసీసీ కల్పించిన ఈ ప్రత్యేక సదుపాయాలను…వివిధ దేశాల మహిళా జట్లు…. పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని… స్థాయికి తగ్గట్టుగా ఆడటం ద్వారా… పురుషుల క్రికెట్ కు మహిళా క్రికెట్ ఏమాత్రం తీసిపోదని చాటుకోవాలని కోరుకొందాం.

First Published:  9 Nov 2018 8:29 AM IST
Next Story