ఎన్నికలు దగ్గరపడుతున్నాయ్.... మోడీ నష్ట నివారణ చర్యలు!
ఒకవైపు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు…. మరోవైపు లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతూ ఉండటం. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటి వరకూ పెరిగిన ప్రజా వ్యతిరేకతను తగ్గించుకునే యత్నం చేస్తున్నట్టుగా ఉన్నాడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. మోడీ ప్రభుత్వంపై బాగా వ్యతిరేకతను పెంచుతున్న అంశాల్లో పెట్రో ధరల అంశం ముఖ్యమైనది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా…. మోడీ ప్రభుత్వం మాత్రం పెట్రో ధరలను తగ్గించడం లేదనే అభిప్రాయాలు బలంగా ఏర్పడ్డాయి జనాల్లో. ఇలాంటి నేపథ్యంలో ఇన్ని […]
ఒకవైపు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు…. మరోవైపు లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతూ ఉండటం. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటి వరకూ పెరిగిన ప్రజా వ్యతిరేకతను తగ్గించుకునే యత్నం చేస్తున్నట్టుగా ఉన్నాడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.
మోడీ ప్రభుత్వంపై బాగా వ్యతిరేకతను పెంచుతున్న అంశాల్లో పెట్రో ధరల అంశం ముఖ్యమైనది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా…. మోడీ ప్రభుత్వం మాత్రం పెట్రో ధరలను తగ్గించడం లేదనే అభిప్రాయాలు బలంగా ఏర్పడ్డాయి జనాల్లో. ఇలాంటి నేపథ్యంలో ఇన్ని రోజులూ మోడీ ప్రభుత్వం తీవ్రంగా విమర్శల పాలయ్యింది.
ఇతర అంశాలకు తోడు పెట్రో ధరల పెంపు కూడా మోడీ ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచుతూ వస్తోంది. ఈ విషయం మోడీకి కూడా తెలియనిది ఏమీ కాదు.
అందుకే…. ఇప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారో ఏమో కానీ…. పెట్రో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గత పదిహేను రోజులుగా పెట్రోల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. లీటర్ పెట్రోల్ ధర దాదాపు నాలుగు రూపాయల వరకూ తగ్గింది.
అంతే కాదట…. రాబోయే రోజుల్లో పెట్రోల్ ధర మరింత తగ్గనున్నదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర మరో ఐదు రూపాయల వరకూ తగ్గవచ్చని చెబుతున్నారు. బహుశా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనే పెట్రో ధర ఈ మాత్రం తగ్గే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మొత్తానికి మోడీ నష్ట నివారణ చర్యలు ముమ్మరం చేసినట్టుగా ఉన్నాడు.