కోదండరాం పోటీ చేసినా డిపాజిట్లు రానివ్వం....
తర్జనభర్జనలు, వడపోతలు, ఉలికిపాట్ల మధ్య ఇప్పుడిప్పుడే తెలంగాణ మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చింది. అధికారికంగా ఏ స్థానం ఏ పార్టీకి అన్నది ప్రకటించకపోయినా స్పష్టమైన లీకులు రావడంతో కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. గాంధీ భవన్ ముందు ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే నల్లగొండ జిల్లా నకిరేకల్ టికెట్‌ను చిరుమర్తి లింగయ్యకు కాకుండా టీడీపీకి కేటాయిస్తే ఉత్తమ్, జానారెడ్డిలను కూడా ఓడిస్తామని ఏకంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డే హెచ్చరించారు. మల్కాజ్‌గిరి సీటు విషయంలోనూ రగడ నడుస్తోంది. మల్కాజ్‌గిరి […]
తర్జనభర్జనలు, వడపోతలు, ఉలికిపాట్ల మధ్య ఇప్పుడిప్పుడే తెలంగాణ మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చింది. అధికారికంగా ఏ స్థానం ఏ పార్టీకి అన్నది ప్రకటించకపోయినా స్పష్టమైన లీకులు రావడంతో కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు.
గాంధీ భవన్ ముందు ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే నల్లగొండ జిల్లా నకిరేకల్ టికెట్‌ను చిరుమర్తి లింగయ్యకు కాకుండా టీడీపీకి కేటాయిస్తే ఉత్తమ్, జానారెడ్డిలను కూడా ఓడిస్తామని ఏకంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డే హెచ్చరించారు.
మల్కాజ్‌గిరి సీటు విషయంలోనూ రగడ నడుస్తోంది. మల్కాజ్‌గిరి సీటును పొత్తులో భాగంగా టీజేఎస్‌కు కేటాయిస్తున్నట్టు వార్తలు రావడంతో కాంగ్రెస్ నేత నందికుంట శ్రీధర్ అనుచరులు గాంధీ భవన్‌ను ముట్టడించారు.
శ్రీధర్‌కు టికెట్ ఖాయమంటే ఇప్పటికే తాము ప్రతి ఇంటికి తిరిగి కాంగ్రెస్‌ను బలోపేతం చేసుకున్నామని ఇప్పుడు కోదండరాం పార్టీకి కేటాయిస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మల్కాజ్‌గిరి టికెట్‌ను తీసుకుని అక్కడి నుంచి దిలీప్‌కుమార్‌ను బరిలో దింపాలని టీజేఎస్ భావిస్తోంది. కానీ కాంగ్రెస్ నేతల హెచ్చరికలు టీజేఎస్‌ను వణికిస్తున్నాయి. మల్కాజ్‌గిరి టికెట్‌ను నందికుంట శ్రీధర్‌కు కాకుండా చివరకు కోదండరాం వచ్చి పోటీ చేసినా డిపాజిట్లు కూడా రాకుండా ఓడిస్తామని కాంగ్రెస్ స్థానిక నేతలు గాంధీభవన్ సాక్షిగానే మీడియా ముందు తేల్చిచెప్పారు.
అటు ఖానాపూర్ టికెట్ విషయంలోనూ గాంధీభవన్ ముందు నిరసనలు కొనసాగుతున్నాయి. ఖానాపూర్ టికెట్‌ను రమేష్ రాథోడ్‌కు ఇస్తే అంగీకరించే ప్రసక్తే లేదని కార్యకర్తలు హెచ్చరించారు. అజ్మీర్ హరినాయక్‌కే టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. అలా జరగని పక్షంలో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి తమ సత్తా చూపిస్తామని హరినాయక్ వర్గం హెచ్చరిస్తోంది.