చంద్రబాబే మా వద్దకు వచ్చారు " జానారెడ్డి
తెలంగాణలో మహాకూటమి మొత్తం చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తోందన్న వాదనను కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఖండించారు. ఇదంతా నాన్‌సెన్స్ అని మండిపడ్డారు. తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జానారెడ్డి… చంద్రబాబే తమ పార్టీతో కలిసి వస్తున్నారని చెప్పారు. చంద్రబాబే రాహుల్ దగ్గరకు వెళ్ళి కలిశారని గుర్తుచేశారు. దేశం అవసరాల కోసం చంద్రబాబు ఆలోచన చేస్తుండవచ్చన్నారు. ఢిల్లీలో చంద్రబాబు చాంబర్ వద్ద తాను ఎదురుచూశానంటూ వచ్చిన వార్తలను కూడా జానారెడ్డి తప్పుపట్టారు. రాహుల్ గాంధీ ఇంటికే […]
తెలంగాణలో మహాకూటమి మొత్తం చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తోందన్న వాదనను కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఖండించారు. ఇదంతా నాన్‌సెన్స్ అని మండిపడ్డారు.
తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జానారెడ్డి… చంద్రబాబే తమ పార్టీతో కలిసి వస్తున్నారని చెప్పారు. చంద్రబాబే రాహుల్ దగ్గరకు వెళ్ళి కలిశారని గుర్తుచేశారు. దేశం అవసరాల కోసం చంద్రబాబు ఆలోచన చేస్తుండవచ్చన్నారు.
ఢిల్లీలో చంద్రబాబు చాంబర్ వద్ద తాను ఎదురుచూశానంటూ వచ్చిన వార్తలను కూడా జానారెడ్డి తప్పుపట్టారు. రాహుల్ గాంధీ ఇంటికే మొదట చంద్రబాబు వచ్చారని.. ఆ తర్వాత చంద్రబాబు ఆఫీస్ వద్దకు తాము వెళ్తే తప్పేంటని ప్రశ్నించారు. చంద్రబాబు కోసం ఆయన చాంబర్ వద్ద తానేమీ ఎదురుచూడలేదన్నారు.
చంద్రబాబును కలిసేందుకు వెళ్లిన సమయంలో అజిత్ సింగ్‌తో ఆయన భేటీ అయ్యారన్నారు. దాంతో భేటీ అయిన తర్వాత తనను పిలవాల్సిందిగా అక్కడి సిబ్బందికి చెప్పి తిరిగి చాంబర్‌కు వెళ్లిపోయానని వివరించారు.
అజిత్ సింగ్ తో భేటీ తర్వాత నాకోసం చంద్రబాబు కబురు చేశారని, దాంతో నేను వెళ్ళి చంద్రబాబుతో ఒక పది నిమిషాలు మాట్లాడానని జానారెడ్డి చెప్పారు. పొత్తులో కలిసి ఉన్నాం కాబట్టి చంద్రబాబుతో రాజకీయ చర్చలు జరిపామని, ఇందులో తప్పేంటని జానారెడ్డి ప్రశ్నించారు. హఠాత్తుగా ఎన్నికలు వచ్చాయని అందుకే అభ్యర్థుల ఎంపికలో కొద్దిగా ఆలస్యం అవుతోందన్నారు.
టీఆర్‌ఎస్ ఎప్పటి నుంచో కసరత్తు చేసినట్టు ఉందని అందుకే ఒకేసారి 105 సీట్లను ప్రకటించిందని జానారెడ్డి అభిప్రాయపడ్డారు.