Telugu Global
Cinema & Entertainment

ఆఫీసర్ రికార్డుల్ని తిరగరాసిన అదుగో

ఈమధ్య కాలంలో చెప్పుకోదగ్గ సినిమాల్లో డిజాస్టర్ అంటే ఆఫీసర్ సినిమానే. వర్మ-నాగ్ కాంబోలో వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లన్నీ కలిపితే కోటి రూపాయల షేర్ కూడా దాటలేదు. ఇన్నాళ్లకు ఆఫీసర్ రికార్డుల్ని తిరగరాసే సినిమా వచ్చింది. అదే అదుగో సినిమా. రవిబాబు డైరక్ట్ చేసిన ఈ సినిమా దీపావళి కానుకగా థియేటర్లలోకి వచ్చి, డిజాస్టర్ అయింది. తొలిరోజు తొలి ఆట చూసిన ప్రేక్షకులు, రెండో ఆటకు ఎవర్నీ థియేటర్లలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారంటే […]

ఆఫీసర్ రికార్డుల్ని తిరగరాసిన అదుగో
X

ఈమధ్య కాలంలో చెప్పుకోదగ్గ సినిమాల్లో డిజాస్టర్ అంటే ఆఫీసర్ సినిమానే. వర్మ-నాగ్ కాంబోలో వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల వసూళ్లన్నీ కలిపితే కోటి రూపాయల షేర్ కూడా దాటలేదు. ఇన్నాళ్లకు ఆఫీసర్ రికార్డుల్ని తిరగరాసే సినిమా వచ్చింది. అదే అదుగో సినిమా.

రవిబాబు డైరక్ట్ చేసిన ఈ సినిమా దీపావళి కానుకగా థియేటర్లలోకి వచ్చి, డిజాస్టర్ అయింది. తొలిరోజు తొలి ఆట చూసిన ప్రేక్షకులు, రెండో ఆటకు ఎవర్నీ థియేటర్లలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారంటే పరిస్థితి అర్థంచేసుకోవచ్చు. అలా మ్యాట్నీ షో నుంచే పడిపోయిన ఈ సినిమాకు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాల్లో కలుపుకొని 70 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

కాస్త హైప్ తో వచ్చిన సినిమాల్లో, ఈమధ్య కాలంలో అతి తక్కువ ఓపెనింగ్స్ ఇవే. చివరికి విజయ్ దేవరకొండ నటించిన ”ఏమంత్రం వేశావె” సినిమాకు కూడా మొదటిరోజు కోటిన్నర వచ్చింది. అదుగో సినిమా మాత్రం ఆ రేంజ్ లో కూడా లేదు. పండగ సీజన్ లో వచ్చి మరీ ఇంత ఫ్లాప్ అయిన సినిమా ఈమధ్య కాలంలో ఇదొక్కటే. రేపట్నుంచి ఈ సినిమాను థియేటర్ల నుంచి తొలిగించడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

First Published:  9 Nov 2018 4:07 AM IST
Next Story