మహాకూటమి.... ఇలాగైతే కష్టమే ఇక!
తెలంగాణ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభ సమయం వచ్చేసింది. పదకొండో తేదీ నుంచి నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికీ మహాకూటమిలో సీట్ల పంచాయితీ తేలకపోవడం గమనార్హం. మహాకూటమిలో తాము చర్చలు సాగిస్తున్నామని.. అంతా కలిసి మీడియా ముందుకు వస్తామని.. మొత్తం సీట్లకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటిస్తామని ఈ కూటమిలోని నేతలు మొదటి నుంచీ చెప్పుకు వస్తున్నారు. అయితే.. ఇప్పటి వరకూ ఆ ముచ్చట జరగలేదు. మరోవైపు ఈ కూటమిలోని పార్టీలు ఎవరికి […]
తెలంగాణ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభ సమయం వచ్చేసింది. పదకొండో తేదీ నుంచి నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికీ మహాకూటమిలో సీట్ల పంచాయితీ తేలకపోవడం గమనార్హం. మహాకూటమిలో తాము చర్చలు సాగిస్తున్నామని.. అంతా కలిసి మీడియా ముందుకు వస్తామని.. మొత్తం సీట్లకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటిస్తామని ఈ కూటమిలోని నేతలు మొదటి నుంచీ చెప్పుకు వస్తున్నారు.
అయితే.. ఇప్పటి వరకూ ఆ ముచ్చట జరగలేదు. మరోవైపు ఈ కూటమిలోని పార్టీలు ఎవరికి వారు తాము పోటీ చేస్తామని సీట్ల జాబితాను ప్రకటించుకోవడం మొదలుపెట్టారు.
తెలుగుదేశం పార్టీ తమ వాటా పద్నాలుగు అంటోంది. ఇక సీపీఐ తొమ్మిది సీట్లను ప్రకటించింది. మరోవైపు టీజేఎస్ పది సీట్లలో పోటీ అంటూనే.. మరో నాలుగు సీట్లలో కూడా అంటోంది.
ఈ విధంగా ఎవరికి వారు తాము పోటీ చేసే సీట్ల నంబర్లను అనౌన్స్ చేస్తున్నారు. అంతా కలిసి సీట్ల ప్రకటన, అభ్యర్థుల ప్రకటన చేస్తామన్న వాళ్లు కాస్తా.. ఇప్పుడు ఎవరికి వారు అభ్యర్థుల ప్రకటనలు చేస్తూ ఉన్నారు.
మరోవైపు నామినేషన్ల గడువు దగ్గర పడుతోంది. ఇలాంటి నేపథ్యంలో మహాకూటమిలో సీట్ల పంచాయితీ ఎప్పటికి తేలుతుంది, తీరా చివరి నిమిషంలో ఎవరికి వారు పోటీ అంటే.. ఇన్ని రోజులూ చేసిందంతా వ్యర్థమేనా అనే చర్చ సాగుతోందిప్పుడు.