ప్రబోధానంద అరెస్ట్‌కు రంగం సిద్ధం
త్రైత సిద్ధాంతకర్త ప్రబోధానంద స్వామి అలియాస్ పెద్దన్న చౌదరి అరెస్ట్‌కు రంగం సిద్ధమవుతోంది. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి వద్ద ఆశ్రమం నిర్వహిస్తున్న ప్రబోధానందకు స్థానిక ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులకు మధ్య ఇటీవల పెద్ద గొడవ జరిగింది. వినాయక నిమజ్జనం సందర్బంగా స్థానిక గ్రామస్తులపై ప్రబోధానంద భక్తుల ముసుగులో కొందరు రాళ్లతో దాడి చేశారు. ట్రాక్టర్లు తగలబెట్టారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. దాంతో […]
త్రైత సిద్ధాంతకర్త ప్రబోధానంద స్వామి అలియాస్ పెద్దన్న చౌదరి అరెస్ట్‌కు రంగం సిద్ధమవుతోంది. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి వద్ద ఆశ్రమం నిర్వహిస్తున్న ప్రబోధానందకు స్థానిక ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులకు మధ్య ఇటీవల పెద్ద గొడవ జరిగింది.
వినాయక నిమజ్జనం సందర్బంగా స్థానిక గ్రామస్తులపై ప్రబోధానంద భక్తుల ముసుగులో కొందరు రాళ్లతో దాడి చేశారు. ట్రాక్టర్లు తగలబెట్టారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. దాంతో నేరుగా రంగంలోకి దిగిన జేసీ దివాకర్ రెడ్డి ప్రబోధానంద అరెస్ట్ కోసం ధర్నాలు కూడా చేశారు. వారం పాటు ఆశ్రమం వద్ద ఉద్రిక్తత కొనసాగింది. దీంతో పోలీసులు మరోదారి లేక ప్రబోధానందపై కేసులు నమోదు చేశారు.
ఆయన అనుచరులపై కూడా కేసులు బుక్ అయ్యాయి. అందులో మర్డర్ కేసు కూడా ఉంది. కానీ ప్రబోధానందకు టీడీపీలోని ఒక కీలక వర్గం మద్దతుగా ఉండడంతో ఇప్పటి వరకు ఆయన్ను అరెస్ట్ చేయలేకపోయారు. ఇంతలో హైకోర్టుకు వెళ్లిన ప్రబోధానంద ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. పిటిషన్‌ను విచారించిన కోర్టు ప్రబోధానంద ముందస్తు బెయిల్ వినతిని కొట్టిపారేసింది. దీంతో ప్రబోధానంద అరెస్ట్ తప్పనిసరి అని భావిస్తున్నారు. కాకపోతే టీడీపీ పెద్దల సహకారం ఉన్న నేపథ్యంలో ప్రబోధానంద అరెస్ట్ సాధ్యమా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది.