బెజవాడలో జనసేన, టీడీపీ ఫ్లెక్సీల యుద్ధం....
బెజవాడలో రాజకీయం వేడెక్కింది. ఇక్కడ జనసేన, టీడీపీ నేతల మధ్య ఫ్లెక్సీల యుద్ధం నడుస్తోంది. ఒకరి స్థాయిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాను 2014లో మద్దతు ఇచ్చి ఉండకపోతే చంద్రబాబు రాజకీయాల నుంచి రిటైర్ అయ్యేవారని పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా తొలుత టీడీపీ నేత కాట్రగడ్డ బాబు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ”నేను కూయందే తెల్లవారదందంట… ఓ అమాయపు కోడి ” అంటూ పవన్‌పై విమర్శలు చేశారు కాట్రగడ్డ. మీ అన్నా దమ్ములంతా కలిసి వచ్చినా […]

బెజవాడలో రాజకీయం వేడెక్కింది. ఇక్కడ జనసేన, టీడీపీ నేతల మధ్య ఫ్లెక్సీల యుద్ధం నడుస్తోంది. ఒకరి స్థాయిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాను 2014లో మద్దతు ఇచ్చి ఉండకపోతే చంద్రబాబు రాజకీయాల నుంచి రిటైర్ అయ్యేవారని పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా తొలుత టీడీపీ నేత కాట్రగడ్డ బాబు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
”నేను కూయందే తెల్లవారదందంట… ఓ అమాయపు కోడి ” అంటూ పవన్‌పై విమర్శలు చేశారు కాట్రగడ్డ. మీ అన్నా దమ్ములంతా కలిసి వచ్చినా 2009లో సాధించింది 18 సీట్లు. ఇప్పుడు తలకిందులు తపస్సు చేసినా వచ్చే ఎన్నికల్లో ఒకటో రెండో సీట్లు గెలిస్తే గొప్ప అంటూ పవన్‌ను కాట్రగడ్డ బాబు ఎద్దేవా చేశారు.
కాట్రగడ్డ బాబు ఫ్లెక్సీకి కౌంటర్‌గా వెంటనే జనసేన వాళ్లూ బెజవాడలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 2004లో బెజవాడ గడ్డ మీద టీడీపీ జీరో అయిందని జనసేన వాళ్లు గుర్తు చేశారు.
2014లో మీరు హీరో అయ్యారంటే అది మీ నాయకుడి తంత్ర ఫలమా లేక మా నాయకుడి(పవన్) కాళ్లు మొక్కిన ఫలమా అంటూ జనసేన నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 2019లో ఓటమి తప్పదన్న భయంతో కాదా కాంగ్రెస్‌తో అక్రమ సంబంధానికి టీడీపీ సిద్ధపడింది అని జనసేన విమర్శించింది.