Telugu Global
National

కర్ణాటక ఉప ఎన్నికలు.... కాంగ్రెస్-జేడీఎస్ ముందంజ

కర్ణాటక ఉప ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ముందంజలో ఉంది. 2019 ఎన్నికల్లో కూడా అధికారంలోకి రావాలని కలలు గంటున్న బీజేపీకి పెద్ద దెబ్బగా మారింది. నిజానికి మొన్నటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది. కానీ అధికారంలోకి రావడానికి మెజార్టీ సీట్లు రాకపోవడంతో అధికారం కోల్పోయింది. ఆ తర్వాత కాంగ్రెస్-జేడీఎస్ తో జతకట్టి కర్ణాటకలో అధికారం చేపట్టింది. తాజాగా కర్ణాటకలోని మూడు లోక్ సభ నియోజకవర్గాలు, రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప […]

కర్ణాటక ఉప ఎన్నికలు.... కాంగ్రెస్-జేడీఎస్ ముందంజ
X

కర్ణాటక ఉప ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ముందంజలో ఉంది. 2019 ఎన్నికల్లో కూడా అధికారంలోకి రావాలని కలలు గంటున్న బీజేపీకి పెద్ద దెబ్బగా మారింది. నిజానికి మొన్నటి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది. కానీ అధికారంలోకి రావడానికి మెజార్టీ సీట్లు రాకపోవడంతో అధికారం కోల్పోయింది. ఆ తర్వాత కాంగ్రెస్-జేడీఎస్ తో జతకట్టి కర్ణాటకలో అధికారం చేపట్టింది.

తాజాగా కర్ణాటకలోని మూడు లోక్ సభ నియోజకవర్గాలు, రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మంగళవారం కౌంటింగ్ జరుగుతోంది. గత శనివారం ఉప ఎన్నికలు నిర్వహించారు.

కాగా మొత్తం ఐదు స్థానాల్లో కాంగ్రెస్ -జేడీఎస్ కూటమి నాలుగింట ముందంజలో ఉండగా.. ఒక చోట బీజేపీ ఆధిక్యంలో ఉంది. మాండ్య, బళ్లారి లోక్ సభ స్థానాలు, రామనగర, జమఖండీ శాసన సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది.

జేడీఎస్…. మాండ్య, రామనగర అభ్యర్థులు శివరామ గౌడ, అనిత కుమారస్వామి గెలుపు ముంగిట ఉన్నారు. ఇక బళ్లారి, జమఖండీలో కాంగ్రెస్ అభ్యర్థులు ఉగ్రప్ప, ఆనంద్ న్యామగౌడ్ పోటీలో ఉన్నారు. రామనగరలో సీఎం కుమారస్వామి సతీమణి అనిత ముందంజలో ఉన్నారు.

ఇక శివమొగ్గ బీజేపీకి బలమైన స్థానం కావడంతో అక్కడ దాని హవానే కొనసాగుతోంది. శివమొగ్గ లోక్ సభ సెగ్మెంట్ లో బీజేపీ అభ్యర్థి మాజీ సీఎం యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర ముందంజలో ఉన్నారు. ఇక్కడ జేడీఎస్ అభ్యర్థి , మాజీ సీఎం బంగారప్ప తనయుడు మధు బంగారప్ప వెనుకబడిపోయారు.

First Published:  6 Nov 2018 12:29 AM GMT
Next Story