Telugu Global
NEWS

గ్రేట‌ర్‌పైనే గులాబీ గురి.... నార్త్‌, సౌత్ ఫిఫ్టి...ఫిఫ్టి...!

తెలంగాణ‌ను మూడు భాగాలుగా విభ‌జించి చూడాలి. ఒక‌టి ఉత్త‌ర తెలంగాణ‌. రెండోది ద‌క్షిణ తెలంగాణ, మూడోది గ్రేట‌ర్ హైద‌రాబాద్‌. రాజకీయంగా చూస్తే ఉత్త‌ర తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు మంచి ప‌ట్టుంది. ద‌క్షిణ తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు ఎడ్జ్ ఉంది. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీ కూట‌మి మెజార్టీ సీట్లు గెలిచింది. దీంతో ఈ సారి ఎవ‌రు ఇక్క‌డ గెలుస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు ప‌ట్టం క‌ట్టారు. మ‌రీ ఈ ఎన్నిక‌ల్లో ఎవ‌రికి ఇక్క‌డి ఓట‌ర్లు […]

గ్రేట‌ర్‌పైనే గులాబీ గురి.... నార్త్‌, సౌత్ ఫిఫ్టి...ఫిఫ్టి...!
X

తెలంగాణ‌ను మూడు భాగాలుగా విభ‌జించి చూడాలి. ఒక‌టి ఉత్త‌ర తెలంగాణ‌. రెండోది ద‌క్షిణ తెలంగాణ, మూడోది గ్రేట‌ర్ హైద‌రాబాద్‌. రాజకీయంగా చూస్తే ఉత్త‌ర తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు మంచి ప‌ట్టుంది. ద‌క్షిణ తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు ఎడ్జ్ ఉంది. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీ కూట‌మి మెజార్టీ సీట్లు గెలిచింది.

దీంతో ఈ సారి ఎవ‌రు ఇక్క‌డ గెలుస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు ప‌ట్టం క‌ట్టారు. మ‌రీ ఈ ఎన్నిక‌ల్లో ఎవ‌రికి ఇక్క‌డి ఓట‌ర్లు ఓటేస్తార‌నేది ఇంట్రెస్టింగ్ పాయింట్‌.

ఉత్తర తెలంగాణలో 54 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. గత ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీఆర్ఎస్ 44 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు, మంత్రులు 20 మంది 2014లో ఓడిపోయారు. ఇప్పుడు వాళ్ల‌లో 15 మంది టీఆర్ఎస్‌కు గ‌ట్టిపోటీ ఇస్తున్నారు.

ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల ప్ర‌కారం ఇక్క‌డ టీఆర్ఎస్‌, కాంగ్రెస్ కూట‌మి స‌గం స‌గం సీట్లు పంచుకునే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్య‌ర్థులను ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. కానీ ఇప్పుడు ఉన్న అంచనాల ప్ర‌కారం టీఆర్ఎస్ 25, కాంగ్రెస్ 19 సీట్లు గెలుస్తుంద‌ని ఓ అంచ‌నా.

దక్షిణ తెలంగాణతో పాటు గ్రేట‌ర్ హైద‌రాబాద్ సీట్లు క‌లిపి చూస్తే మొత్తం 65. ఇందులో గత ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ 19 సీట్లు గెలిచింది. నల్గొండలో 6, మహబూబ్ నగర్‌లో 7, ఖ‌మ్మంలో ఒక‌టి గెలిచింది. గ్రేట‌ర్‌లో మూడు, రంగారెడ్డిలో రెండు విజ‌యం సాధించింది. అయితే ఈ సారి ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలలోని 26 అసెంబ్లీ సీట్లలో 5, 6 కు మించి సీట్లు టిఆర్ఎస్ కు సానుకూలంగా లేవన్నది కాంగ్రెస్, టిడిపి నాయకులు వేస్తున్న అంచ‌నా.

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 29 సీట్లు ఉంటే… టీఆర్ఎస్‌ 5సీట్లను గెలుచుకోగలిగింది. ఈ సారి ఇక్క‌డ డ‌జ‌న్ సీట్లు సాధించాల‌ని టీఆర్ఎస్ ప్లాన్‌. అందుకే గ్రేట‌ర్‌లో గెలుపుకోసం ముందు నుంచీ త‌గు ప్లాన్‌లు ర‌చిస్తోంది. ఉత్త‌ర తెలంగాణ‌లో త‌గ్గే సీట్లను గ్రేట‌ర్‌లో గెలుపు ద్వారా పూరించుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

ద‌క్షిణ తెలంగాణ‌లో త‌గ్గే సీట్ల‌ను ఖ‌మ్మంలోని మెజార్టీ సీట్ల‌ను గెల‌వ‌డం ద్వారా బ్యాలెన్స్ చేయాల‌ని చూస్తోంది. మొత్తానికి గ్రేట‌ర్‌లో గెలిచే పార్టీలే ఎక్కువ సీట్లు సాధించే అవ‌కాశం ఉన్న‌ట్లు విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్నాయి.

First Published:  6 Nov 2018 5:00 AM IST
Next Story