Telugu Global
National

ఈ-కామర్స్ సంస్థలకు షాక్.... నకిలీ వస్తువులపై షాకింగ్ సర్వే

దీపావళి పండుగ వచ్చింది. దేశంలోని ప్రఖ్యాత ఈ-కామర్స్ సంస్థలన్నీ భారీ ఆఫర్ల వాన కురిపిస్తున్నాయి. 50 నుంచి 70శాతం వరకు వస్తువులపై ఆఫర్లు ఇస్తున్నాయి. తాజాగా ఈ కామర్స్ సంస్థలు పంపిణీ చేసే ప్రతి ఐదు వస్తువుల్లో ఒకటి నకిలీవే వస్తున్నాయని…. ఇందులో సౌందర్య, సుగంధ వస్తువుల్లోనే ఎక్కువగా ఇలా జరుగుతోందని ‘లోకల్ సర్కిల్స్’ అనే సర్వే సంస్థ నిగ్గు తేల్చింది. జాతీయ అగ్ర మీడియా సంస్థ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ సౌజన్యంతో ‘లోకల్ సర్కిల్స్’ చేసిన […]

ఈ-కామర్స్ సంస్థలకు షాక్.... నకిలీ వస్తువులపై షాకింగ్ సర్వే
X

దీపావళి పండుగ వచ్చింది. దేశంలోని ప్రఖ్యాత ఈ-కామర్స్ సంస్థలన్నీ భారీ ఆఫర్ల వాన కురిపిస్తున్నాయి. 50 నుంచి 70శాతం వరకు వస్తువులపై ఆఫర్లు ఇస్తున్నాయి. తాజాగా ఈ కామర్స్ సంస్థలు పంపిణీ చేసే ప్రతి ఐదు వస్తువుల్లో ఒకటి నకిలీవే వస్తున్నాయని…. ఇందులో సౌందర్య, సుగంధ వస్తువుల్లోనే ఎక్కువగా ఇలా జరుగుతోందని ‘లోకల్ సర్కిల్స్’ అనే సర్వే సంస్థ నిగ్గు తేల్చింది.

జాతీయ అగ్ర మీడియా సంస్థ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ సౌజన్యంతో ‘లోకల్ సర్కిల్స్’ చేసిన ఈ సర్వేలో దాదాపు 30వేల మంది ఈ కామర్స్ వినియోగదారుల నుంచి సమాచారాన్ని సేకరించారు. గడిచిన ఆరు నెలల్లో ఈ సర్వే నిర్వహించారు. ఇందులో 20శాతం మంది తమకు నకిలీ వస్తువులు ఈ కామర్స్ సంస్థ ద్వారా వచ్చాయని స్పష్టం చేశారు.

వినియోగదారులను ఈ నకిలీ వస్తువులు సరఫరా చేసే సంస్థల గురించి అడగగా…. ఇందులో 37శాతం స్నాప్ డీల్ నుంచి నకిలీ వస్తువులు వస్తున్నాయని…. ఆ తర్వాత స్థానంలో 22శాతం ఫ్లిప్ కార్ట్, 21శాతం పేటిఎం మాల్ నుంచి , 20శాతం అమేజాన్ నుంచి నకిలీ వస్తువులు సరఫరా అవుతున్నట్టు తేల్చారు. ఇందులో 35శాతం మంది తమకు సుగంధ పరిమళాల సెంట్స్, ఇతర బాడీ స్ప్రేలు, కాస్మోటిక్స్ లు నకిలీవి వస్తున్నాయని పేర్కొన్నారు. 22శాతం క్రీడా వస్తువులు, 8శాతం బ్యాగులు నకిలీవి వస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ నకిలీ వస్తువుల సరఫరాపై టైమ్స్ ఆఫ్ ఇండియా సదురు ఈ కామర్స్ సంస్థలకు నివేదిక పంపగా…. ఆ సంస్థలు మాత్రం ఈ లోపం తమది కాదంటూ చెప్పుకొచ్చాయి. చాలా పకడ్బందీగా, కఠినంగా బట్వాడా చేపడుతున్నామని.. అయితే తమకు సరఫరా చేసే కొంత మంది అమ్మకం దారులే ఈ అక్రమాలకు పాల్పడి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. పంపిణీ చేసే సమయంలో కొందరు వస్తువులను మార్చి ఉండవచ్చని అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. రైళ్ళో సరుకులు పంపే సమయంలో కూడా వీటిని మార్చి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశాయి.

ప్రపంచవ్యాప్తంగా ఈ నకిలీ వస్తువులు ఈ-కామర్స్ సంస్థలకు శరాఘాతంగా మారుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత అలీబాబా, అమేజాన్ సంస్థలు కూడా నకిలీ వస్తువులు పంపిణీ చేయడంపై అమెరికాలో ఫిర్యాదులొస్తే…. అమెరికా ప్రభుత్వం హెచ్చరికలు పంపి జరిమానాలు కూడా విధించింది. వినియోగదారులకు నష్టపరిహారం చెల్లింపచేశాయి. నకిలీ వస్తువులను మార్చి బట్వాడా చేసే వారిని గుర్తించి అరెస్ట్ చేశారు.

ఇండియాలోని డ్రగ్ రెగ్యులేటరీ కూడా తాజాగా ఈ కామర్స్ వెబ్ సైట్లకు నకిలీ కాస్మోటిక్స్ సరఫరాపై నోటీసులు అందించాయి.

పండుగ వేళ భారీ ఆఫర్లు ఇచ్చిన కంపెనీలకు ఈ సర్వే గుబులు రేపుతోంది. అత్యధిక సేల్స్ అంటూ ఊదరగొడుతున్న కంపెనీలకు ఈ నకిలీ వస్తువులు సరఫరా కాకుండా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు. నకిలీ వస్తువులను మార్చే అక్రమార్కుల వల్ల దిగ్గజ మార్కెటింగ్ ఈ కామర్స్ సంస్థలకు చెడ్డ పేరు వస్తోందని ”ఆల్ ఇండియా ఆన్ లైన్ వెండర్స్ అసోసియేషన్” అధికార ప్రతినిధి వెల్లడించారు.

తాజాగా కేంద్ర వినియోగదారుల ఫోరం కూడా ఈ వివాదంపై స్పందించింది. నకిలీ వస్తువులపై ఈ కామర్స్ కంపెనీలు జవాబుదారీగా వ్యవహరించాలని సూచించింది. లేకపోతే ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించింది.

First Published:  5 Nov 2018 9:51 PM GMT
Next Story