Telugu Global
Family

మంథర

మంథర. ఈ పేరును అప్పుడప్పుడూ మనం వింటూ వుంటాం కదా?, ఏ సందర్భంలో మంథరని తలచుకుంటామో తెలుసుకదా?! చక్కగావున్న వాళ్ళ మధ్యన చేరి చెడు సలహాలను ఉచితంగా ఇచ్చే వాళ్ళను, గొడవలు పెట్టేవాళ్ళను ‘మంథర’ అని అనడం కద్దు. ఈ మంథర రామాయణంలోని పాత్ర. రాముడు అడవులు పట్టిపోవడానికి మంథర మాటలే కారణం. అవే రాముని జీవితాన్ని మలుపులు తిప్పాయి. రామాయణం రక్తికట్టడానికి ముక్తి గొలపడానికి కారణం అయ్యాయి. కైకేయినకు మంథర దాసిగా వుండేది. శ్రీరామునికి పట్టాభిషేకం […]

మంథర. ఈ పేరును అప్పుడప్పుడూ మనం వింటూ వుంటాం కదా?, ఏ సందర్భంలో మంథరని తలచుకుంటామో తెలుసుకదా?! చక్కగావున్న వాళ్ళ మధ్యన చేరి చెడు సలహాలను ఉచితంగా ఇచ్చే వాళ్ళను, గొడవలు పెట్టేవాళ్ళను ‘మంథర’ అని అనడం కద్దు. ఈ మంథర రామాయణంలోని పాత్ర. రాముడు అడవులు పట్టిపోవడానికి మంథర మాటలే కారణం. అవే రాముని జీవితాన్ని మలుపులు తిప్పాయి. రామాయణం రక్తికట్టడానికి ముక్తి గొలపడానికి కారణం అయ్యాయి. కైకేయినకు మంథర దాసిగా వుండేది. శ్రీరామునికి పట్టాభిషేకం కట్టబోతున్నారన్న వార్త విని కైక దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళింది. ‘అమ్మా… కైకేయమ్మా రాముడు నీకునూ ఇష్టుడే కావచ్చు. కానీ నీ సొంత కుమారుడు భరతుడికి పోటి అవుతాడా? కాదు, కాని నీ భర్త దశరథ మహారాజు కౌసల్య పుత్రుడయిన రామునికి పట్టాభిషేకం కడుతున్నాడు. రాముడు రాజైతే కౌసల్యకు నీవు దాసివి కావలసి వస్తుంది. అలాంటిది ఈ వార్త నీకు సంతోషం కలిగించడం ఆశ్చర్యంగా వుంది’ అని మాటల్ని మంటపెట్టి రాజేసింది. అయినా కైకేయికి ఈర్ష్య కలుగలేదు. అలాగని మంథర అక్కడితో ఆగలేదు. ”కైకమ్మా కైకమ్మా.. నీకు యేం కావాలో తెలియడంలేదు. అందుకే భరతుని భవిష్యత్తుని గురించి ఆలోచించడం లేదు. ఇప్పుడేమీ తెలియదులే. రేపు రామునికాడ నీకొడుకు చేతులు కట్టుకొని కనుసన్నల్లో సేవకుడిగా మెలిగినప్పుడు అప్పుడు నీవీ గౌరవంతో బతకగలవా?” అని నూరిపోసిందే కాక ”మేలు కోరి చెపుతున్నాను” అంటూ గతంలో దశరథుడు ఆమెకిచ్చిన రెండు వరాలను గుర్తు చేసింది. రామునికి పదునాలుగు సంవత్సరాల అరణ్యవాసం. రెండవ కోరికగా భరతునికి పట్టాభిషేకం కోరమని కైకేయినకు బోధించి, ఆమె మనస్సును వశము చేసుకొని కోతిని ఆడించినట్టు ఆడించింది మంథర. రామునిది ఒకటే మాటని ఒకటే బాటని ఆచరణలో చూపడానికి పరోక్షంగా కారకురాలైంది మంథర!.

First Published:  6 Nov 2018 9:00 AM GMT
Next Story