Telugu Global
NEWS

అధికారం కోసం బీజేపీ, మజ్లిస్ తో కేసీఆర్ " జైపాల్ రెడ్డి

తెలంగాణలో జరిగే ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ కు 50 శాతం సీట్లు రావని…. అధికారం కోసం బీజేపీ, మజ్లిస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కుట్ర పన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ ప్లాన్ ఇదేనంటూ బయటపెట్టారు. వచ్చే ఎన్నికల తర్వాత కేసీఆర్ అధికారానికి దగ్గరగా వచ్చి ఆగిపోతాడని…. బీజేపీ, మజ్లిస్ తో కలిసి గద్దెనెక్కాలని చూస్తున్నాడని జైపాల్ […]

అధికారం కోసం బీజేపీ, మజ్లిస్ తో కేసీఆర్  జైపాల్ రెడ్డి
X

తెలంగాణలో జరిగే ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ కు 50 శాతం సీట్లు రావని…. అధికారం కోసం బీజేపీ, మజ్లిస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కుట్ర పన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ ప్లాన్ ఇదేనంటూ బయటపెట్టారు.

వచ్చే ఎన్నికల తర్వాత కేసీఆర్ అధికారానికి దగ్గరగా వచ్చి ఆగిపోతాడని…. బీజేపీ, మజ్లిస్ తో కలిసి గద్దెనెక్కాలని చూస్తున్నాడని జైపాల్ రెడ్డి అన్నారు. మజ్లిస్ పార్టీ ఏడుస్థానాల్లో గెలవడం ఖాయమని.. బీజేపీ ఆరు ఏడు స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని వివరించారు. టీఆర్ఎస్ కు సీట్లు తక్కువగా వస్తే వెంటనే కేసీఆర్ మజ్లిస్, బీజేపీతో చర్చలు జరుపుతారని జోస్యం చెప్పారు.

ప్రధాని మోడీతో కేసీఆర్ కు మంచి సంబంధాలున్నాయని జైపాల్ రెడ్డి వివరించారు. అయితే ఈసారి కాంగ్రెస్ కు స్పష్టమైన మెజార్టీ వస్తుందని జైపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి అద్భుత విజయం సాధించడం ఖాయమని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే తాను సీఎం రేసులో లేనని.. ఎవరు సీఎం అవుతారో కూడా చెప్పలేమని అన్నారు. వయోభారం వల్లే తాను పోటీచేయలేకపోతున్నానని వివరించారు. కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని.. ఆందోళనలో ఉన్నారని జైపాల్ రెడ్డి వివరించారు.

First Published:  5 Nov 2018 2:10 AM IST
Next Story