Telugu Global
NEWS

అప్పుడు ఎలుకలు, కుక్కలు..... ఇప్పుడు కోతుల వంతు

ఆంధ్రప్రదేశ్‌లో ఆసుపత్రుల పరిస్థితి చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే. ఒక వేళ అలా జరగకపోతే అంత హీన స్థితిలో ఉన్న ఆసుపత్రులకు అవార్డులు వచ్చాకైనా దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అవ్వాల్సిందే. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పాపను ఎలుకలు కొరికి చంపడం చూశాం. ఉత్తరాంధ్ర ఆసుపత్రుల్లో…. సినిమా టిక్కెట్లకోసం క్యూలో నిలబెట్టినట్టు… నేల మీద కూర్చోబెట్టి సెలైన్‌లు ఎక్కించడం చూశాం. ఒక్కో బెడ్డు మీద ముగ్గురు బాలింతలను పడుకోబెడితే…. కిందపడి బాలింతలకు గాయాలు కావడం చూశాం. ఆసుపత్రి ఆవరణలో పేషెంట్లపై […]

అప్పుడు ఎలుకలు, కుక్కలు..... ఇప్పుడు కోతుల వంతు
X

ఆంధ్రప్రదేశ్‌లో ఆసుపత్రుల పరిస్థితి చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే. ఒక వేళ అలా జరగకపోతే అంత హీన స్థితిలో ఉన్న ఆసుపత్రులకు అవార్డులు వచ్చాకైనా దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అవ్వాల్సిందే.

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పాపను ఎలుకలు కొరికి చంపడం చూశాం. ఉత్తరాంధ్ర ఆసుపత్రుల్లో…. సినిమా టిక్కెట్లకోసం క్యూలో నిలబెట్టినట్టు… నేల మీద కూర్చోబెట్టి సెలైన్‌లు ఎక్కించడం చూశాం. ఒక్కో బెడ్డు మీద ముగ్గురు బాలింతలను పడుకోబెడితే…. కిందపడి బాలింతలకు గాయాలు కావడం చూశాం.

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో

ఆసుపత్రి ఆవరణలో పేషెంట్లపై కుక్కలు దాడుచేయడం, పందులు దాడులు చేయడం చూశాం…. అయినా ఆ ఆసుపత్రులకు అవార్డులు వస్తాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆసుపత్రుల నిర్వహణలో గొప్పగా ఉందని అవార్డులు, రివార్డులు ఇస్తారు. మరో గొప్ప అవార్డు రావాల్సిన సంఘటన ఇప్పుడు తిరుపతి ఆసుపత్రిలో జరిగింది.

ఇప్పటి వరకూ జరిగిన వాటికి పరాకాష్టగా…. ఇప్పుడు తిరుపతి ఎస్వీ మెడికల్‌ కాలేజీ ప్రయోగశాల నుంచి బయాప్సీ స్పెసిమన్స్‌ను కోతులు ఎత్తుకుపోవడం చూస్తున్నాం. ఒక బయాప్సీ శాంపిల్‌ను కోతులు ఎత్తుకెళ్ళాయని వైద్యులు ఆందోళన పడుతుంటే….. ఒకటి కాదు నాలుగు శాంపిల్స్‌ ఎత్తుకెళ్ళాయని చావుకబురు చల్లగా చెప్పారు ఆసుపత్రి నిర్వాహకులు.

First Published:  4 Nov 2018 7:34 AM IST
Next Story