Telugu Global
NEWS

రాహుల్‌ చంద్రబాబుతో కలిసిపోయింది అందుకోసమేనా?

చంద్రబాబు నాయుడును కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు చేరదీస్తోంది? మొన్నటి వరకూ ఎన్డీయేలో ఉండి మోడీ భజన చేసి, కాంగ్రెస్ మీద విరుచుకు పడుతూ వచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉన్న ఫళంగా వచ్చి చేరగానే కాంగ్రెస్ దగ్గరకు తీసుకుంది. ఇప్పుడు ఎవరు వచ్చి చేరినా కాంగ్రెస్ పార్టీ రా… రమ్మంటుంది. ఎవరినీ వద్దు అని అయితే అనలేదు. ప్రతిపక్షంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. వచ్చే ఎన్నికల్లో సోలోగా మోడీని ఢీ కొట్టలేమని కాంగ్రెస్ కు ఎప్పుడో అర్థం […]

రాహుల్‌ చంద్రబాబుతో కలిసిపోయింది అందుకోసమేనా?
X

చంద్రబాబు నాయుడును కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు చేరదీస్తోంది? మొన్నటి వరకూ ఎన్డీయేలో ఉండి మోడీ భజన చేసి, కాంగ్రెస్ మీద విరుచుకు పడుతూ వచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉన్న ఫళంగా వచ్చి చేరగానే కాంగ్రెస్ దగ్గరకు తీసుకుంది. ఇప్పుడు ఎవరు వచ్చి చేరినా కాంగ్రెస్ పార్టీ రా… రమ్మంటుంది. ఎవరినీ వద్దు అని అయితే అనలేదు.

ప్రతిపక్షంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. వచ్చే ఎన్నికల్లో సోలోగా మోడీని ఢీ కొట్టలేమని కాంగ్రెస్ కు ఎప్పుడో అర్థం అయిపోయింది. ఇలాంటి నేపథ్యంలో ఎంతమంది స్నేహితులు వస్తే అంత హ్యాపీ కాంగ్రెస్ కు.

అలాగే పోటీ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా త్యాగాలకు రెడీ అయిపోయింది. అన్ని సీట్లలోనూ తనే పోటీ చేయాలని కాంగ్రెస్ అనుకోవడం లేదు కూడా. మెజారిటీ సీట్లను మిత్రపక్షాలకు ఇవ్వడానికి సై అంటోంది.

ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తమతో రావడం పట్ల కాంగ్రెస్ ఖుషీగానే ఉంది.

ఇక బాబు విషయంలో కాంగ్రెస్ పార్టీ కి మరో టెంప్టింగ్ ఆఫర్ కూడా ఉందట. అదేమిటంటే…. డబ్బు. చంద్రబాబు నాయుడు తమతో కలిసి వస్తే భారీగా డబ్బు సర్ధుబాటు చేస్తాడని కాంగ్రెస్ అధిష్టానం లెక్కేసినట్టుగా సమాచారం.

ఎన్నికల ఫండ్ కు బాబు భారీగా డబ్బు సర్దగలడు అని…. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల ఖర్చును ఆయనే భరిస్తాడనే భరోసాతో ఉన్నాడట రాహుల్ గాంధీ. ఇదే కాంగ్రెస్ హై కమాండ్‌ను ఎక్కువగా టెంప్ట్ చేస్తోందని సమాచారం.

First Published:  4 Nov 2018 12:30 PM IST
Next Story