Telugu Global
National

ఎంజే అక్బర్‌కు మరో పదవి నుంచి ఉద్వాసన

న్యూఢిల్లీలోని ప్రసిద్ధ నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ (ఎన్ఎంఎంఎల్) కి చెందిన నలుగురు సభ్యులకు కేంద్రం ఉద్వాసన పలికింది. వీరు తీన్ మూర్తి ఎస్టేట్ లో ప్రధాన మంత్రుల మ్యూజియం నిర్మాణాన్ని వ్యతిరేకించడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ తొలగించిన సొసైటీ సభ్యుల స్థానంలో కొత్త వారిని కేంద్రం నియమించింది. ఇందులో బీజేపీ అనుకూలుడనే ముద్ర ఉన్న ప్రఖ్యాత జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి ఎస్. జయశంకర్, బీజేపీ […]

ఎంజే అక్బర్‌కు మరో పదవి నుంచి ఉద్వాసన
X

న్యూఢిల్లీలోని ప్రసిద్ధ నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ (ఎన్ఎంఎంఎల్) కి చెందిన నలుగురు సభ్యులకు కేంద్రం ఉద్వాసన పలికింది. వీరు తీన్ మూర్తి ఎస్టేట్ లో ప్రధాన మంత్రుల మ్యూజియం నిర్మాణాన్ని వ్యతిరేకించడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ తొలగించిన సొసైటీ సభ్యుల స్థానంలో కొత్త వారిని కేంద్రం నియమించింది. ఇందులో బీజేపీ అనుకూలుడనే ముద్ర ఉన్న ప్రఖ్యాత జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి ఎస్. జయశంకర్, బీజేపీ ఎంపీ వినయ్ సహస్రబుద్ది, ఐజీఎన్ సీఏ చైర్మన్ రామ్ బహదూర్ రాయ్ కు ఎన్ఎంఎంఎల్ లో చోటు కల్పించింది.

తాజాగా కేంద్రం నియమించిన ఈ నలుగురు సభ్యులు 2020 ఏప్రిల్ 25 వరకూ ఈ కమిటీలో కొనసాగనున్నారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ ఇటీవలే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ఎంజే అక్బర్‌ను ఎన్ఎంఎంఎల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వైస్ చైర్మన్ గా తప్పించనున్నారు. కేంద్రం నియమించిన కమిటీలో జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామికి చోటు కల్పించడంతో ఆయన బీజేపీ అనుకూలుడనే వాదనకు బలం చేకూరింది.

First Published:  4 Nov 2018 9:30 AM IST
Next Story