రేవూరి వర్సెస్ కొండా సురేఖ !
మహాకూటమిలో సీట్ల లెక్కలు సెగలు రేపుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ 95 స్థానాలలో పోటీ చేస్తామని ప్రకటించింది. టీడీపీకి 14 సీట్లు ఇచ్చినట్లు లెక్కలు చెబుతోంది. టీడీపీకి ఇచ్చిన సీట్లను కూడా కాంగ్రెస్ నేతలు ప్రచారంలో పెట్టారు. కూకట్‌పల్లి, ఉప్పల్, శేరిలింగంపల్లి, సికింద్రాబాదు, నిజామాబాద్ రూరల్, దేవరకద్ర,మక్తల్, ఖమ్మం, మలక్‌పేట్, సత్తుపల్లి, అశ్వరావుపేట,ధర్మపురి సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ 12 సీట్ల విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్, టీడీపీ మధ్య […]
మహాకూటమిలో సీట్ల లెక్కలు సెగలు రేపుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ 95 స్థానాలలో పోటీ చేస్తామని ప్రకటించింది. టీడీపీకి 14 సీట్లు ఇచ్చినట్లు లెక్కలు చెబుతోంది. టీడీపీకి ఇచ్చిన సీట్లను కూడా కాంగ్రెస్ నేతలు ప్రచారంలో పెట్టారు. కూకట్‌పల్లి, ఉప్పల్, శేరిలింగంపల్లి, సికింద్రాబాదు, నిజామాబాద్ రూరల్, దేవరకద్ర,మక్తల్, ఖమ్మం, మలక్‌పేట్, సత్తుపల్లి, అశ్వరావుపేట,ధర్మపురి సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ 12 సీట్ల విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్, టీడీపీ మధ్య ఎలాంటి పంచాయతీ లేదు.
అయితే ఓ రెండు సీట్ల విషయంలో మాత్రం పంచాయతీ వచ్చి పడింది. అందులో ఒకటి పరకాల. రెండోది రాజేంద్రనగర్. పరకాల సీటును ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన కొండా సురేఖ ఫ్యామిలీ అడుగుతోంది. పరకాల నుంచి పోటీ చేసేందుకు వారు రెడీ అవుతున్నారు. అయితే ఇంకా ప్రచారం మాత్రం ప్రారంభించలేదు.
ఇదే సీటును టీడీపీ సీనియర్ నేత రేవూరి ప్రకాష్‌రెడ్డి అడుగుతున్నారు. తనకు ఇవే చివరి ఎన్నికలు అని… పరకాల ఇవ్వాలని పట్టుబడుతున్నారు. తనకు పరకాల ఇవ్వకపోతే ఊరుకునేది లేదని పార్టీ నేతలకు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈ సీటు విషయంలో పీటముడి పడింది. వరంగల్ ఈస్ట్‌ను టీడీపీ తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారు.
పరకాల టీడీపీ సిట్టింగ్ టికెట్ కాబట్టి తమకు ఇవ్వాలని ఆ పార్టీ నేతల వాదన. దీంతో ఈ సీటు ఫైట్ కొండా సురేఖ వర్సెస్ రేవూరి ప్రకాష్‌రెడ్డిగా మారింది.
మరోవైపు రాజేంద్రనగర్ సీటు కూడా ఇలాగే సెగలు రేపుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ గెలిచింది. ఈ సిట్టింగ్ సీటు తమకు ఇవ్వాలని పట్టుబడుతోంది. ఇక్కడ సీనియర్ నేత దేవేందర్‌గౌడ్‌తో పాటు పలువురు సీనియర్ నేతలు పోటీకి రెడీ అవుతున్నారు.
అయితే ఈ సీటులో కాంగ్రెస్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పోటీకి రెడీ అవుతున్నారు. ఆమె లేదా ఆమె కొడుకు కార్తీక్‌రెడ్డి రాజేంద్రనగర్ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు టీడీపీ ముందు ఓ ప్రతిపాదన పెట్టారు. టీడీపీ మరో సిట్టింగ్ సీటు అయిన కంటోన్మెంట్ తీసుకోవాలని కోరుతున్నారు. ఈరెండు సీట్ల పంచాయతీ ప్రస్తుతం జరుగుతోంది. దీపావళి లోపు ఈ సీట్ల పంచాయతీ తేలితే…. కూటమి సీట్ల ప్రకటన జరగొచ్చని అంటున్నారు.