Telugu Global
NEWS

గ‌జ్వేల్‌లో ముదిరిన యుద్ధం! ఒంటేరు సంచ‌ల‌నం

తెలంగాణ సీఎం కేసీఆర్ పోటీ చేసే గ‌జ్వేల్ రాజ‌కీయం హాట్‌హాట్‌గా మారింది. ఇప్ప‌టికే టీఆర్ఎస్ నేత గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే ఒంటేరు నర్సారెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇదీ ఒక సంచ‌ల‌న‌మైతే…. ఇప్పుడు మంత్రి హ‌రీష్‌రావు టార్గెట్‌గా ఒంటేరు బాణాలు ఎక్కుపెట్టారు. ముఖ్యమంత్రి కెసీఆర్ ను ఓడించాలని…. దీనికి అవసరమైన ఆర్థిక సాయం తాను చేస్తానని హరీష్ రావు హామీ ఇఛ్చారని ప్ర‌తాప్‌రెడ్డి అన్నారు. అవినీతి సొమ్ము తనకు అవసరం లేదని తేల్చిచెప్పినట్లు ప్రతాప్ రెడ్డి తెలిపారు. […]

గ‌జ్వేల్‌లో ముదిరిన యుద్ధం! ఒంటేరు సంచ‌ల‌నం
X

తెలంగాణ సీఎం కేసీఆర్ పోటీ చేసే గ‌జ్వేల్ రాజ‌కీయం హాట్‌హాట్‌గా మారింది. ఇప్ప‌టికే టీఆర్ఎస్ నేత గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే ఒంటేరు నర్సారెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇదీ ఒక సంచ‌ల‌న‌మైతే…. ఇప్పుడు మంత్రి హ‌రీష్‌రావు టార్గెట్‌గా ఒంటేరు బాణాలు ఎక్కుపెట్టారు.

ముఖ్యమంత్రి కెసీఆర్ ను ఓడించాలని…. దీనికి అవసరమైన ఆర్థిక సాయం తాను చేస్తానని హరీష్ రావు హామీ ఇఛ్చారని ప్ర‌తాప్‌రెడ్డి అన్నారు. అవినీతి సొమ్ము తనకు అవసరం లేదని తేల్చిచెప్పినట్లు ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఓ ప్రైవేట్ నెంబర్ నుంచి ఈ కాల్ వచ్చిందని…. ఈ అంశంపై ఏ దేవుడి దగ్గర అయినా ప్రమాణం చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు ఒంటేరు ప్రతాప్ రెడ్డి ప్రకటించటం సంచలనం రేపుతోంది.

ఈ ఫోన్ కాల్ తనకు శుక్రవారం నాడు వచ్చిందని అన్నారు. అన్ని బాధ్యతలు కెటీఆర్ కే అప్పగిస్తూ తన పరువు తీస్తున్నారని హరీష్ రావు వాపోయారని ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. కెసీఆర్ వైఖరితో తనకు రాజకీయ జీవితం లేకుండా పోతోందని హరీష్ రావు అన్నట్లు తెలిపారు. త్వ‌ర‌లోనే ఆయ‌న కాంగ్రెస్ గూటికి చేరే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెప్పుకొచ్చారు.

కెసీఆర్ ను ఓడించేందుకు కలిసి పనిచేద్దామని చెప్పారన్నారు. తనకు గజ్వేల్ ప్రజలు అండగా ఉన్నారని…. కెసీఆర్ కుటుంబం మొత్తం వచ్చి ప్రచారం చేసినా విజయం తనదేనని ప్రతాప్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్ లో నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడుతూ ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే కెసీఆర్, హరీష్ రావు ల మధ్య గ్యాప్ బాగా పెరిగిందని పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. ఈ తరుణంలో ఒంటేరు ప్రతాప్ రెడ్డి వేసిన బాంబ్ అగ్గి రాజేస్తోంది. అయితే ఒంటేరు ప్ర‌తాప్‌రెడ్డి వ్యాఖ్య‌ల‌ను హ‌రీష్‌రావు ఖండించారు. ఒంటేరు మ‌తిభ్ర‌మించి మాట్లాడుతున్నార‌ని అన్నారు. గ‌జ్వేల్‌లో ప్ర‌తాప్‌రెడ్డికి డిపాజిట్ రాకుండా చేస్తాన‌ని చాలెంజ్ విసిరారు. త‌న పుట్టుక‌…చావు టీఆర్ఎస్‌లోనే అని చెప్పుకొచ్చారు హరీష్ రావు.

First Published:  4 Nov 2018 2:40 AM IST
Next Story