Telugu Global
NEWS

ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద లక్ష్మీపార్వతి నిరసన.... కోర్టుకెళ్తానని ప్రకటన

కాంగ్రెస్‌తో టీడీపీ జతకట్టడంపై ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు తీరుకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నిరసనకు దిగారు. తన భావనలను లేఖలో రాసి ఎన్టీఆర్ సమాధి వద్ద ఉంచారామె. కాంగ్రెస్‌తో కలవడంతోనే ఎన్టీఆర్‌ ఫొటోను పెట్టుకునే అర్హతను టీడీపీ కోల్పోయిందన్నారు. ఏ సిద్ధాంతం కోసం ఎన్టీఆర్‌ పార్టీ పెట్టారో ఆ మూల సిద్ధాంతానికే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆమె మండిపడ్డారు. నాలుగేళ్లుగా మోడీతో అంటకాగి ఇప్పుడు తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్‌తో […]

ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద లక్ష్మీపార్వతి నిరసన.... కోర్టుకెళ్తానని ప్రకటన
X

కాంగ్రెస్‌తో టీడీపీ జతకట్టడంపై ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు తీరుకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నిరసనకు దిగారు. తన భావనలను లేఖలో రాసి ఎన్టీఆర్ సమాధి వద్ద ఉంచారామె. కాంగ్రెస్‌తో కలవడంతోనే ఎన్టీఆర్‌ ఫొటోను పెట్టుకునే అర్హతను టీడీపీ కోల్పోయిందన్నారు.

ఏ సిద్ధాంతం కోసం ఎన్టీఆర్‌ పార్టీ పెట్టారో ఆ మూల సిద్ధాంతానికే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆమె మండిపడ్డారు. నాలుగేళ్లుగా మోడీతో అంటకాగి ఇప్పుడు తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్‌తో కలిశారని విమర్శించారు. చంద్రబాబు పొత్తుపెట్టుకోని పార్టీ ఏదైనా మిగిలి ఉందా అని ప్రశ్నించారు.

ఎన్టీఆర్‌ ఉన్నప్పుడు ఏనాడు కూడా పొత్తుల కోసం వెంపర్లాడలేదని… కలిసి వచ్చిన కమ్యూనిస్టులతో మాత్రమే ముందుకెళ్లారని చెప్పారు. చంద్రబాబు మాత్రం టీడీపీని ఎంతగా దిగజార్చాలో అంతగా దిగజార్చేశారని ఫైర్ అయ్యారు. టీడీపీని నడిపించే నైతికతను కూడా చంద్రబాబు కోల్పోయారన్నారు. ఇంతకంటే దిగజారుడు నాయకత్వం టీడీపీకి ఉండదన్నారు. ఇంతకంటే టీడీపీకి అవమానం ఉందా అని ప్రశ్నించారు.

చంద్రబాబు ఇంత అన్యాయానికి ఒడిగడుతుంటే ఒక్క టీడీపీ నేత కూడా ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ పెట్టిన టీడీపీని చంద్రబాబు ఇలా చేయడాన్ని తాను జీర్ణించుకోలేక పోతున్నానని చెప్పారు. పార్టీ మూల సిద్ధాంతానికే తూట్లు పొడిచిన చంద్రబాబుకు వ్యతిరేకంగా కోర్టుకు కూడా వెళ్తానని చెప్పారు. న్యాయం కోసం తన ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఇకపై టీడీపీ వాళ్లు ఎన్టీఆర్‌ ఫొటోను పెట్టుకోకూడదని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఎన్టీఆర్‌ పేరు ఉచ్చరించే అర్హత కూడా చంద్రబాబుకు లేదన్నారు.

First Published:  3 Nov 2018 1:54 AM GMT
Next Story