Telugu Global
NEWS

లగడపాటి సర్వే రహస్యం ఇదేనా?

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అసలు సర్వే చేస్తారా?. ఆంధ్రా ఆక్టోపస్ గా పేరొందిన ఆయన రిపోర్టు ఎలా తయారు చేస్తారు? జనం నాడి ఎలా పడతారు అన్న సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అసలు విషయం ఏమిటో తెలిస్తే అందరూ నోరెళ్లబెట్టాల్సిందే. సర్వే చేయాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. క్షేత్ర స్థాయిలో జనం నాడి పట్టాలి. అందుకు వాలంటీర్లు ఉండాలి. కనీసం ఒక్కొక్కరికి రోజుకు రూ.500 చొప్పున ఖర్చవుతుంది. ఆయన తరపున ఎక్కడా సర్వే జరుగుతున్న […]

లగడపాటి సర్వే రహస్యం ఇదేనా?
X

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అసలు సర్వే చేస్తారా?. ఆంధ్రా ఆక్టోపస్ గా పేరొందిన ఆయన రిపోర్టు ఎలా తయారు చేస్తారు? జనం నాడి ఎలా పడతారు అన్న సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అసలు విషయం ఏమిటో తెలిస్తే అందరూ నోరెళ్లబెట్టాల్సిందే.

సర్వే చేయాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. క్షేత్ర స్థాయిలో జనం నాడి పట్టాలి. అందుకు వాలంటీర్లు ఉండాలి. కనీసం ఒక్కొక్కరికి రోజుకు రూ.500 చొప్పున ఖర్చవుతుంది. ఆయన తరపున ఎక్కడా సర్వే జరుగుతున్న దాఖలాలు లేవు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన ఇప్పుడు హఠాత్తుగా ఎన్నికల సమయంలో మీడియా ముందుకు వచ్చారు. తన పేరుతో వస్తున్న సర్వేలన్నీ ఫేక్ అని కొట్టిపారేశారు.

ఆయన సర్వే లెక్కల వెనుక అసలు విషయాలను కొంత మంది పార్టీల నేతలు ఆరా తీశారట. ఉత్త కహానీలనే తేల్చి పారేశారు. ఆయనకు రూ.55,000 కోట్లకు పైగానే బ్యాంకుల్లో అప్పులు ఉన్నాయట. ఎన్నికలు సమయంలో తనకు రాజకీయంగా అవసరం ఉన్న పార్టీకి ఆదరణ ఉందంటూ సర్వే ప్రకటించి వెళ్లిపోతారట. సర్వే ఎలా చేశారన్న ప్రశ్నకు సమాధానం ఉండకపోవడం ఇందుకు కారణంగా భావిస్తున్నారు.

మరికొందరేమో ఈయన సొంతంగా సర్వేలు చేయించడని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ కొడుకు ఎన్నికల సర్వేలలో దిట్ట అని…. ఆయన అభిప్రాయాలను తెలుసుకుని తన సర్వే ఫలితాలుగా లగడపాటి చెబుతుంటాడని అంటున్నారు.

లగడపాటి తన అప్పులను కప్పిపుచ్చుకునేందుకు మీడియా ముందుకు హఠాత్తుగా వచ్చి ఆ తరువాత తన బిజినెస్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారని కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సోనియాతో ఎప్పుడూ టచ్ లో ఉంటారని, గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఆయన అనుకూలంగా తీర్పు చెప్పారని.. కానీ అవి నిజం కాకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని వివరిస్తున్నారు. మరలా ఇప్పుడు హడావుడి చేయడం వెనుక మతలబు ఏంటనే విషయాలను ఔత్సాహికులు ఆరా తీస్తున్నారు. ఆయన ఒట్టు తీసి గట్టు మీద పెట్టి రాజకీయాల్లోకి వస్తారనే పుకార్లు వినిపిస్తున్నాయి.

First Published:  3 Nov 2018 2:45 AM IST
Next Story