శవాలకు ఆహ్వానం పలికే హోటల్ గురించి తెలుసా మీకు..?
గుమ్మడికాయంత బుర్రలో ఆవగింజంత తెలివి ఉంటే చాలు ప్రపంచాన్ని దున్నేయోచ్చన్న సామెతను నిజం చేయోచ్చు. అచ్చం ఈ సామెతను నిజం చేస్తున్నాడు జపాన్ కు చెందిన లాస్టెల్ హోటల్ అధినేత హిసయోషి తెరామురా. ఇంతకీ ఈయన ఏ వ్యాపారం చేస్తుంటారనేగా మీ డౌట్. సాధారణంగా హోటల్స్ అంటే శుభకార్యాలకు, అతిథులకు ఆతిథ్యం ఇచ్చేందుకు వినియోగిస్తుంటారు. కానీ తెరామురా అలా కాదు అతిథులతోపాటు, శవాలకు రూం లను అద్దెకిస్తుంటారు. శవాలను నిల్వ ఉంచినందుకు సుమారు రూ.8వేల రూపాయాల్ని వసూలు […]
గుమ్మడికాయంత బుర్రలో ఆవగింజంత తెలివి ఉంటే చాలు ప్రపంచాన్ని దున్నేయోచ్చన్న సామెతను నిజం చేయోచ్చు. అచ్చం ఈ సామెతను నిజం చేస్తున్నాడు జపాన్ కు చెందిన లాస్టెల్ హోటల్ అధినేత హిసయోషి తెరామురా. ఇంతకీ ఈయన ఏ వ్యాపారం చేస్తుంటారనేగా మీ డౌట్.
సాధారణంగా హోటల్స్ అంటే శుభకార్యాలకు, అతిథులకు ఆతిథ్యం ఇచ్చేందుకు వినియోగిస్తుంటారు. కానీ తెరామురా అలా కాదు అతిథులతోపాటు, శవాలకు రూం లను అద్దెకిస్తుంటారు. శవాలను నిల్వ ఉంచినందుకు సుమారు రూ.8వేల రూపాయాల్ని వసూలు చేస్తున్నాడు. ఓవైపు ఆ హోటల్ కు వచ్చిన అతిథులు ఇదే హోటల్ రా బాబోయ్ అని భయపడుతుంటే…. మరికొందరు ఆహోటల్ లోని శవాలను చూసి ఆశ్చర్యపోతున్నారట.
సాధారణంగా ఏదైనా వ్యాపారంలో రాణించాలంటే పెట్టుబడి, మార్కెటింగ్ ఉంటే సరిపోదు ఆవగింజంత తెలివి ఉంటే సరిపోతుంది. జపాన్ లో మృతదేహాల్ని భద్రపరిచే కాఫిన్లు అవసరమైన సామాగ్రిని లాస్టెల్ తయారు చేస్తుంటారు. అయితే ఓ రోజు తెరామురాకు ఓ ఐడియా వచ్చింది. జపాన్ లో చనిపోయేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. ప్రకృతి విపత్తులు కూడా ఎక్కువే.
అందుకే నిత్యం వందలాది మంది చనిపోతుంటారు. వారికి దహన సంస్కారాలు చేసేందుకు సరైన సదుపాయాలు, శ్మశాన వాటికల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ రద్దీనే ఆసరగా తీసుకున్న తెరామురా శవాలకు తన హోటల్ లో వసతి కల్పించేలా నిర్మాణం చేపట్టాడు. అదిగో అప్పటి నుండి ఆ హోటల్ లో శవాలు తిష్టేసుకొని ఉంటున్నాయి.