బాబు పాపాలన్నీ మోయాల్సిన ఖర్మ మనకెందుకు? " సీ. రామచంద్రయ్య
టీడీపీతో కాంగ్రెస్ పొత్తును ఆ పార్టీ సీనియర్ నేత సి. రామచంద్రయ్య తీవ్రంగా తప్పుపట్టారు. పొత్తుపై కనీసం పీసీసీని కూడా సంప్రదించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్లను అసలే సంప్రదించలేదన్నారు. కాంగ్రెస్ గురించి చంద్రబాబు మాట్లాడిన మాటలను మరిచి పోలేమన్నారు. విభజన సమయంలో చంద్రబాబు కాంగ్రెస్‌ను కోలుకోలేని దెబ్బతీశారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. రాహుల్ గాంధీ వస్తే గుంటూరులో నల్లబ్యాడ్జీలతో టీడీపీ శ్రేణులు ప్రదర్శన చేశాయని గుర్తు చేశారు. […]
టీడీపీతో కాంగ్రెస్ పొత్తును ఆ పార్టీ సీనియర్ నేత సి. రామచంద్రయ్య తీవ్రంగా తప్పుపట్టారు. పొత్తుపై కనీసం పీసీసీని కూడా సంప్రదించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్లను అసలే సంప్రదించలేదన్నారు. కాంగ్రెస్ గురించి చంద్రబాబు మాట్లాడిన మాటలను మరిచి పోలేమన్నారు.
విభజన సమయంలో చంద్రబాబు కాంగ్రెస్‌ను కోలుకోలేని దెబ్బతీశారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. రాహుల్ గాంధీ వస్తే గుంటూరులో నల్లబ్యాడ్జీలతో టీడీపీ శ్రేణులు ప్రదర్శన చేశాయని గుర్తు చేశారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలను తామెందుకు సమర్ధించాలని రామచంద్రయ్య ప్రశ్నించారు.
చంద్రబాబుకు ఒక సిద్దాంతం అంటూ ఏమీ లేదని ఎవరితోనైనా కలుస్తారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసిన పాపాలన్నీ భుజాన వేసుకోవాల్సిన ఖర్మ మాకెందుకని రామచంద్రయ్య ప్రశ్నించారు. ఆధారాలతో ఓటుకునోటు కేసులో ఇరుక్కున్న వ్యక్తితో పొత్తా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక కార్యకర్తగా టీడీపీ- కాంగ్రెస్ పొత్తును తాను ప్రశ్నిస్తున్నానని రామచంద్రయ్య వ్యాఖ్యానించారు.