గుజరాత్ ప్లాన్ తెలంగాణలో వర్క్‌వుట్ అవుతుందా?
తెలంగాణలో గెలుపు కోసం కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో సోషల్ ఇంజనీరింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చింది. సామాజిక ఉద్యమాల నాయకులను దగ్గర చేసుకోవడం ద్వారా గుజరాత్‌లో కాంగ్రెస్ బలం పెంచుకుంది. ఇదే తరహాలో తెలంగాణలో కూడా సామాజిక ఉద్యమ నేతలతో దోస్తీ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. గుజరాత్‌లో పటీదార్ ఉద్యమ నేత హార్థిక్ పటేల్, ఎస్సీలపై దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించిన జిగ్నేష్ మేవానీ, బీసీ నేత అల్పేష్ ఠాకూర్ లాంటి వారి మద్దతును […]
తెలంగాణలో గెలుపు కోసం కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో సోషల్ ఇంజనీరింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చింది. సామాజిక ఉద్యమాల నాయకులను దగ్గర చేసుకోవడం ద్వారా
గుజరాత్‌లో కాంగ్రెస్ బలం పెంచుకుంది. ఇదే తరహాలో తెలంగాణలో కూడా సామాజిక ఉద్యమ నేతలతో దోస్తీ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.
గుజరాత్‌లో పటీదార్ ఉద్యమ నేత హార్థిక్ పటేల్, ఎస్సీలపై దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించిన జిగ్నేష్ మేవానీ, బీసీ నేత అల్పేష్ ఠాకూర్ లాంటి వారి మద్దతును కాంగ్రెస్ కూడగట్టింది. దీంతో 20 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ బీజేపీకి గట్టి పోటీ ఇవ్వగలిగింది. మోదీకి వణుకు పుట్టించింది.
తెలంగాణలోనూ ఇదే ఫార్ములాను వర్క్‌వుట్ చేయాలని చూస్తోంది. సామాజిక ఉద్యమ నేతల మద్దతు కాంగ్రెస్‌కు ఉండేలా వ్యూహాన్ని అమలు చేస్తోంది. ప్రజా గాయకుడు గద్దర్, బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య, ఎమ్మార్పీఎస్ నేత
మంద కృష్ణమాదిగ లాంటి సామాజిక ఉద్యమకారుల మద్దతు కూడగడుతోంది.
దీంతో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాం ఇప్పటికే పార్టీ పెట్టారు. ఆయన పార్టీతో కాంగ్రెస్ కూటమి కట్టింది. టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులను ఒకచోటికి చేరిస్తే గెలుపు సాధ్యమని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో కొందరి నేతలకు అధికారంలోకి వస్తే మంచి పదవులు ఇస్తామని ఆఫర్ ఇస్తోంది. అందుకు తగ్గట్టుగా ఢిల్లీకి తీసుకెళ్లి హామీలు ఇస్తోంది. తెలంగాణలో గుజరాత్ ప్లాన్ వర్క్‌వుట్ అయి… కాంగ్రెస్‌ను అధికార తీరానికి చేరుస్తుందో లేదో చూడాలి.