Telugu Global
NEWS

వినోద్‌కు కాంగ్రెస్ ఆ సీటు ఆఫ‌ర్ చేసిందా?

టీఆర్ఎస్ నేత‌, కాకా వార‌సుడు గ‌డ్డం వినోద్ కుమార్ కాంగ్రెస్‌లో చేరుతారా? లేదా? అనే విష‌యం గురువారం తేలిపోనుంది. త‌మ్ముడు వివేక్‌తో తెగ‌దెంపులు చేసుకున్న‌ట్లు స‌మాచారం అందుతోంది. ఇవాళ ఆయ‌న ఢిల్లీలో రాహుల్‌ గాంధీతో భేటీ కాబోతున్నారు. ఈ మీటింగ్ త‌ర్వాత ఆయ‌న కాంగ్రెస్‌లో చేరేది లేనిది అన్న విష‌యంపై స్ప‌ష్ట‌త రాబోతుంది. అయితే వినోద్ కాంగ్రెస్‌లో చేర‌డం ఖాయ‌మ‌ని మాత్రం తెలుస్తోంది. అయితే వినోద్ కాంగ్రెస్‌లో చేరితే ఏ సీటు ఇవ్వాల‌నే దానిపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న కొన‌సాగుతోంది. […]

వినోద్‌కు కాంగ్రెస్ ఆ సీటు ఆఫ‌ర్ చేసిందా?
X

టీఆర్ఎస్ నేత‌, కాకా వార‌సుడు గ‌డ్డం వినోద్ కుమార్ కాంగ్రెస్‌లో చేరుతారా? లేదా? అనే విష‌యం గురువారం తేలిపోనుంది. త‌మ్ముడు వివేక్‌తో తెగ‌దెంపులు చేసుకున్న‌ట్లు స‌మాచారం అందుతోంది. ఇవాళ ఆయ‌న ఢిల్లీలో రాహుల్‌ గాంధీతో భేటీ కాబోతున్నారు. ఈ మీటింగ్ త‌ర్వాత ఆయ‌న కాంగ్రెస్‌లో చేరేది లేనిది అన్న విష‌యంపై స్ప‌ష్ట‌త రాబోతుంది. అయితే వినోద్ కాంగ్రెస్‌లో చేర‌డం ఖాయ‌మ‌ని మాత్రం తెలుస్తోంది.

అయితే వినోద్ కాంగ్రెస్‌లో చేరితే ఏ సీటు ఇవ్వాల‌నే దానిపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న కొన‌సాగుతోంది. వినోద్ చెన్నూరు సీటు అడుగుతున్నారు. అయితే ఈసీటు బోర్ల‌కుంట వెంక‌టేష్‌కు ఇస్తున్న‌ట్లు స‌మాచారం. కొప్పుల రాజు అండ‌తో వెంక‌టేష్ టిక్కెట్ త‌న‌కు వ‌స్తుంద‌ని ప్ర‌చారం చేసుకుంటున్నారు. రేవంత్ వ‌ర్గానికి చెందిన బోడ జ‌నార్ద‌న్ కూడా టికెట్ రేసులో ఉన్నారు. బెల్లంప‌ల్లి సీటును గ‌ద్ద‌ర్ కొడుకు సూర్య‌కిర‌ణ్‌కు ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా ధర్మపురి నియోజకవర్గం నుంచి వినోద్ ను బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇక్క‌డ టీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వ‌ర్ పోటీ చేస్తారు. ధ‌ర్మ‌పురిని కంచుకోటగా మార్చుకున్న ఈశ్వ‌ర్‌ను దెబ్బ‌కొట్టాలంటే వినోద్ క‌రెక్ట్ క్యాండేట్ అని కాంగ్రెస్ నేత‌లు భావిస్తున్నార‌ట‌. ధ‌ర్మ‌పురి లేక‌పోతే చొప్ప‌దండి నుంచి వినోద్ బ‌రిలోకి దిగే అవ‌కాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

First Published:  1 Nov 2018 1:49 AM IST
Next Story