Telugu Global
NEWS

బాబు ఢిల్లీలో.... అగ్రిగోల్డ్ బాధితులు బెజవాడలో.... టెన్షన్‌ టెన్షన్‌

మరోసారి విజయవాడ ధర్నా చౌక్ అగ్రిగోల్డ్ బాధితుల ఆందోళనకు వేదికగా మారింది. ప్రభుత్వం న్యాయం చేయడం లేదంటూ, కేసుల పేరుతో కాలయాపన చేస్తుందంటూ ఈ రోజు ఉదయం నుంచి 30 గంటల పాటు ”ధర్మాగ్రహ దీక్ష” కు తలపెట్టారు. భారీ స్థాయిలో ధర్నా చౌక్ కు చేరుకుంటున్న బాధితులను పోలీసులు అడ్డుకుంటున్నారు. అగ్రి గోల్డ్ లో పెట్టుబడులు పెట్టి ఎంతో మంది పేద, మధ్య తరగతి బాధితులు భారీగా నష్టపోయారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ […]

బాబు ఢిల్లీలో.... అగ్రిగోల్డ్ బాధితులు బెజవాడలో.... టెన్షన్‌ టెన్షన్‌
X

మరోసారి విజయవాడ ధర్నా చౌక్ అగ్రిగోల్డ్ బాధితుల ఆందోళనకు వేదికగా మారింది. ప్రభుత్వం న్యాయం చేయడం లేదంటూ, కేసుల పేరుతో కాలయాపన చేస్తుందంటూ ఈ రోజు ఉదయం నుంచి 30 గంటల పాటు ”ధర్మాగ్రహ దీక్ష” కు తలపెట్టారు. భారీ స్థాయిలో ధర్నా చౌక్ కు చేరుకుంటున్న బాధితులను పోలీసులు అడ్డుకుంటున్నారు.

అగ్రి గోల్డ్ లో పెట్టుబడులు పెట్టి ఎంతో మంది పేద, మధ్య తరగతి బాధితులు భారీగా నష్టపోయారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ పేరుతో సంఘంగా ఏర్పడి ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అగ్రి గోల్డ్ సంస్థ ఖాతాదారులకు చెల్లింపులు చేయలేక చేతులెత్తేసింది. ఈ విషయంలో చంద్రబాబు, లోకేష్ లపై పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వస్తున్నాయి. అగ్రిగోల్డ్ దివాళాకు లోకేష్ ముఖ్య కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి.

విడతల వారీగా ఆందోళన చేస్తున్న అగ్రి గోల్డ్ బాధితుల వివరాలను సీబీఐ కూడా సేకరించింది. ఆ తరువాత ఉలుకు పలుకు లేకపోవడంతో అక్టోబరులో ఒకసారి కలెక్టరేట్ ల వద్ద ఆందోళన చేపట్టారు. మరలా ఈ రోజు విజయవాడ ధర్నా చౌక్ వద్ద 30 గంటల పాటు ధర్మ పోరాట దీక్షకు దిగుతున్నామని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ సభ్యులు ప్రకటించారు. ధర్నాపై ఆంక్షలు విధించిన పోలీసులు భారీగా చేరుకుంటున్న బాధితులను తుమ్మలపల్లి కళా క్షేత్రం వద్ద అడ్డుకుంటున్నారు.

ఇప్పటికే టీడీపీ ప్రభుత్వ వ్యవహార శైలిపై అగ్రిగోల్డ్ బాధితులు గుర్రుగా ఉన్నారు. ఎన్నికల నాటికి ఆందోళనను తీవ్రతరం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి న్యాయం చేయాలని కోరడమే ఎజెండాగా పెట్టుకున్నారు. ఈ విషయంలో చేతులెత్తిసినట్లు ప్రవర్తిస్తున్న చంద్రబాబు, లోకేష్ లకు వచ్చే ఎన్నికల్లో గట్టిగా సమాధానమిస్తామని వాళ్ళు పేర్కొంటున్నారు.

First Published:  1 Nov 2018 6:09 AM IST
Next Story