Telugu Global
NEWS

రాజీనామా యోచనలో ఆర్బీఐ గవర్నర్.... మోడీ తీరుకు నిరసనగానే....?

ప్రధాని మోడీ గద్దెనెక్కాక వ్యవస్థలన్నింటిని డమ్మీలుగా మార్చేశాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దానికి బలం చేకూరేలా ఇటీవల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు వంటి కీలక నిర్ణయంలో తనకు సహాయపడ్డ గుజరాతీ అధికారి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్ కు ఎసరు పెడుతున్నాడు మోడీ.. దీనికి కారణం లేకపోలేదు. స్వతంత్ర సంస్థ అయిన రిజర్వ్ బ్యాంకు ను చెప్పుచేతుల్లో పెట్టుకునేందుకు మోడీ వేస్తున్న ప్లాన్ ను ఉర్జిత్ వ్యతిరేకిస్తున్నారు. ఆర్బీఐ చట్టంలోని […]

రాజీనామా యోచనలో ఆర్బీఐ గవర్నర్.... మోడీ తీరుకు నిరసనగానే....?
X

ప్రధాని మోడీ గద్దెనెక్కాక వ్యవస్థలన్నింటిని డమ్మీలుగా మార్చేశాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దానికి బలం చేకూరేలా ఇటీవల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు వంటి కీలక నిర్ణయంలో తనకు సహాయపడ్డ గుజరాతీ అధికారి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్ కు ఎసరు పెడుతున్నాడు మోడీ.. దీనికి కారణం లేకపోలేదు. స్వతంత్ర సంస్థ అయిన రిజర్వ్ బ్యాంకు ను చెప్పుచేతుల్లో పెట్టుకునేందుకు మోడీ వేస్తున్న ప్లాన్ ను ఉర్జిత్ వ్యతిరేకిస్తున్నారు.

ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7ను ప్రయోగించి బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయడానికి సిద్ధమవుతోంది. ప్రజాప్రయోజనాల పేరుతో ఆర్బీఐ పై గుత్తాధిపత్యం చెలాయించాలని అనుకుంటున్న కేంద్రం వైఖరిపై అసంతృప్తిగా ఉన్న ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేసి కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టాలని నిర్ణయించుకోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది..

కొన్ని రోజులుగా ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. తాజాగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ .. ఆర్బీఐ పై విమర్శలు చేశారు. ఆర్థిక పతనానికి ఆర్బీఐ కారణమని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఉర్జిత్ పటేల్ సీరియస్ అయ్యి పదవి నుంచి వైదొలిగి బీజేపీ నేతల బండారం బయటపెట్టాలని డిసైడ్ అయ్యారని వార్తలొస్తున్నాయి.

తాజాగా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య వ్యాఖ్యలతో కేంద్రం, ఆర్బీఐ మధ్య మాటల యుద్ధం తారా స్థాయి కి చేరింది. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7 కింద రిజర్వ్ బ్యాంకు కు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయాలని కేంద్రం ముందుకురావడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. విభేదాల దృష్ట్యా ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేయాలని భావిస్తున్నారని.. జాతీయ మీడియా సంస్థలతో ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై అధికారికంగా ఉర్జిత్ పటేల్ కానీ, పీఎంవో కానీ స్పందించలేదు. దీంతో మరో వ్యవస్థను కబళించేందుకు ప్రధాని మోడీ టీం సిద్ధమైందనే వార్త కలకలం రేపుతోంది.

First Published:  31 Oct 2018 12:58 AM GMT
Next Story