జగన్ ను పరామర్శించిన టీడీపీ నేత!
హత్యాయత్నంలో గాయపడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని పలువురు ప్రముఖులు పరామర్శిస్తున్నారు. జగన్ గాయపడిన తొలి రోజునే పలువురు నేతలు ఆయనకు ఫోన్ చేసిన వార్తలు వచ్చాయి. అయితే ఆ పరామర్శలను కూడా చంద్రబాబు నాయుడు రాజకీయం చేశాడు. వాళ్లంతా జగన్ ను పరామర్శించడం తనపై జరుగుతున్న కుట్రగా బాబు చెప్పుకొచ్చాడు. అయితే బాబు అలా మాట్లాడటం వివాదాస్పదం అయ్యింది. బాబుది నీచ రాజకీయం అని.. పరామర్శించడం కూడా తప్పేనా అని పలువురు […]
హత్యాయత్నంలో గాయపడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని పలువురు ప్రముఖులు పరామర్శిస్తున్నారు. జగన్ గాయపడిన తొలి రోజునే పలువురు నేతలు ఆయనకు ఫోన్ చేసిన వార్తలు వచ్చాయి. అయితే ఆ పరామర్శలను కూడా చంద్రబాబు నాయుడు రాజకీయం చేశాడు. వాళ్లంతా జగన్ ను పరామర్శించడం తనపై జరుగుతున్న కుట్రగా బాబు చెప్పుకొచ్చాడు.
అయితే బాబు అలా మాట్లాడటం వివాదాస్పదం అయ్యింది. బాబుది నీచ రాజకీయం అని.. పరామర్శించడం కూడా తప్పేనా అని పలువురు ప్రశ్నించారు. దీంతో బాబు కామ్ అయిపోవాల్సి వచ్చింది.
ఆ సంగతలా ఉంటే…. జగన్ కు పరామర్శలు కొనసాగుతూ ఉన్నాయి.
ఈ జాబితాలో అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురనాథ్ రెడ్డి ఉండటం విశేషం. ఈయన కొన్నాళ్ల కిందట వైసీపీని వీడి తెలుగుదేశంపార్టీలోకి చేరాడు. జగన్ తో విభేదించి వెళ్లిపోయాడు. అయితే ఇప్పుడు ఈయన జగన్ ను పరామర్శించడం ఆసక్తిదాయకంగా మారింది.
జగన్ మోహన్ రెడ్డి కుటుంబంతో గురునాథ్ రెడ్డి కుటుంబానికి మొదటి నుంచి సత్సంబంధాలున్నాయి. రాజశేఖర రెడ్డి అండదండలతోనే వాళ్ళ కుటుంబం రాజకీయంగా ఎదిగింది.
అయితే వచ్చే ఎన్నికల్లో గురునాథ్ రెడ్డికి టికెట్ దక్కడం కష్టమన్న వార్తల నేపథ్యంలో ఆయన వైసీపీని వీడాడు. అయితే ఇప్పుడు జగన్ ను పరామర్శించడానికి మాత్రం గురునాథ్ రెడ్డి వెనుకాడలేదు.
ఈ పరామర్శలో రాజకీయం ఉందా లేదా అనేది ముందు ముందు తెలిసే అవకాశం ఉంది. కొంతమంది టీడీపీనేతలు మాత్రం ఈ పరామర్శను తప్పుపడుతున్నారని సమాచారం.