Telugu Global
National

ఉక్కు మనిషి పటేల్ విగ్రహావిష్కరణ, విగ్రహంలో వింతలు, విశేషాలు, లిఫ్టులు ....

దేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ బుధవారం అట్టహాసంగా జరిగింది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే రెండింతలు పొడవైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఉదయం దీనిని ఆవిష్కరించి జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. సర్దార్ సరోవర్ డ్యాంపై ఈ నిర్మాణం చేపట్టారు. పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చేసి ఇక్కడకు చేరుకొనే పర్యాటకులకు ప్రకృతి అందాలు కనువిందు చేసేలా ఏర్పాట్లు చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 565 సంస్థానాలను దేశంలో విలీనం […]

ఉక్కు మనిషి పటేల్ విగ్రహావిష్కరణ, విగ్రహంలో వింతలు, విశేషాలు, లిఫ్టులు ....
X

దేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ బుధవారం అట్టహాసంగా జరిగింది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే రెండింతలు పొడవైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఉదయం దీనిని ఆవిష్కరించి జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. సర్దార్ సరోవర్ డ్యాంపై ఈ నిర్మాణం చేపట్టారు. పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చేసి ఇక్కడకు చేరుకొనే పర్యాటకులకు ప్రకృతి అందాలు కనువిందు చేసేలా ఏర్పాట్లు చేశారు.

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 565 సంస్థానాలను దేశంలో విలీనం చేసి దేశ సమైక్యతను పటిష్ట పరిచేందుకు పటేల్ విశేష కృషి చేశారు. ఆయన సంకల్పాన్ని భావి తరాలకు తెలియజేసే ఉద్దేశ్యంతో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ విగ్రహ ఏర్పాటుకు సంకల్పించారు. ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఎట్టకేలకు పూర్తి చేశారు.

అత్యధిక కాంక్రీట్ వాడి సర్దార్ సరోవర్ డ్యాంపై పటేల్ విగ్రహాన్ని అత్యాధునిక పద్ధతిలో నిర్మించారు. విగ్రహం ఎత్తు 182 మీటర్లు. 180 కిలో మీటర్ల వేగంతో వచ్చే గాలులను కూడా తట్టుకోగలదు. 6.5 తీవ్రతతో వచ్చే భూ కంపాలను తట్టుకొని నిలవగలదు. విగ్రహానికి చేరుకోవడానికి రోడ్డు, రైలు మార్గాలను ఏర్పాటు చేశారు. పడవలోనూ రావచ్చు.

విగ్రహం లోపలి నుంచి ఛాతి వరకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. అంత ఎత్తు నుంచి ప్రకృతి అందాలను వీక్షించేందుకు అవకాశం కల్పించారు. పటేల్ కాళ్ల దగ్గర నుంచి పైకి ఛాతి వరకు చేరుకునేందుకు (157 మీటర్ల వరకు) లోపల రెండు లిఫ్టులను ఏర్పాటు చేశారు. పర్యాటకుల కోసం అనేక ఏర్పాట్లు చేశారు. విడిది, విశ్రాంతి, ఆహారం కోసం శ్రేష్ఠభారత్ భవన్, పటేల్ జీవిత విశేషాలను తెలుపుతూ ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు.

పటేల్ విగ్రహ విశేషాలు…

* ఎత్తు 182 మీటర్లు

* ప్రాజెక్టు వ్యయం: రూ.3001 కోట్లు

* నిర్మాణదారులు ఎల్ అండ్ టీ, మెయిన్ హార్ట్, మైఖేల్ గ్రేవ్స్

* దేశంలోని 1,69,000 గ్రామాల నుంచి ఇనుమును సేకరించారు

* 300 మంది ఇంజనీర్లు, 3000 మంది కార్మికులు పనిచేశారు

* నిర్మాణ ప్రదేశం.. సాధు బెట్ ఐలాండ్, సర్దార్ సరోవర్ డ్యామ్ కు 3.5 కిలో మీటర్ల దూరం, వింద్యాచల్, సాత్పూర పర్వత సానువుల మధ్య..

* 1700 టన్నుల కాంస్యం, 1,80,000 టన్నుల స్టీల్ కాంక్రీట్ లో కలిపి,

విడిగా బయట మరో 6,500 టన్నుల స్టీల్ వాడారు

* విగ్రహం లోపల నుంచి 157 మీటర్ల ఎత్తు వెళ్లేందుకు రెండు లిఫ్టులు

First Published:  31 Oct 2018 6:39 AM IST
Next Story