రాఫెల్ డీల్ బయటపెట్టం.... సుప్రీంకు కేంద్రం షాక్.... దొంగ దొరికినట్టేనా?
అనుకున్నదే అయ్యింది. సుప్రీం కోర్టుకు కేంద్రం షాక్ ఇచ్చింది.. అందరి అనుమానాలకు బలం చేకూర్చేలా..? ప్రతిపక్ష కాంగ్రెస్ చేతికి ఆయుధాన్ని ఇచ్చేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దొరికిపోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. రాఫెల్ కుంభకోణం జరిగిందనడానికి బలాన్నిచ్చేలా కేంద్రం వ్యవహరించిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.. ఫ్రాన్స్ కు చెందిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో భారీ కుంభకోణం దాగి ఉందని గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ పెద్ద ఎత్తున ఆరోపణలు […]
అనుకున్నదే అయ్యింది. సుప్రీం కోర్టుకు కేంద్రం షాక్ ఇచ్చింది.. అందరి అనుమానాలకు బలం చేకూర్చేలా..? ప్రతిపక్ష కాంగ్రెస్ చేతికి ఆయుధాన్ని ఇచ్చేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దొరికిపోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. రాఫెల్ కుంభకోణం జరిగిందనడానికి బలాన్నిచ్చేలా కేంద్రం వ్యవహరించిన తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది..
ఫ్రాన్స్ కు చెందిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో భారీ కుంభకోణం దాగి ఉందని గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. దీనిపై ప్రధాని మోడీ ఇంతవరకు నోరు తెరవలేదు. రాఫెల్ ఒప్పందం కోసం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ ను భారత ప్రభుత్వమే ప్రతిపాదించిందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలన్ చేసిన వ్యాఖ్యలు దేశంలో రాజకీయ దుమారానికి తెరలేపాయి. దీంతో రాఫెల్ ఒప్పందంపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ సుప్రీం కోర్టులో పలువురు కాంగ్రెస్ నేతలు, ఇతరులు పిటీషన్లు దాఖలు చేశారు.
కొద్దిరోజుల క్రితమే దీనిపై విచారించిన సుప్రీం కోర్టు 10 రోజుల్లోగా రాఫెల్ ఒప్పందానికి అయిన ఖర్చు, యుద్ధ విమానాల ధర తదితర పూర్తి వివరాలను 10 రోజుల్లోగా సీల్డ్ కవర్ లో సమర్పించాలని ఆదేశించింది. అయితే బుధవారం జరిగిన రాఫెల్ పై విచారణలో కేంద్రం దిమ్మదిరిగే కౌంటర్ దాఖలు చేసింది..
అయితే ఇది చాలా కాన్ఫిడెన్సియల్ అని రాఫెల్ విమానాల ఒప్పందాన్ని బహిర్గతం చేయలేమని కేంద్రం వెల్లడించింది. ఈ విమానాల ధర చాలా ప్రత్యేకమైనదని.. దీన్ని న్యాయస్థానంతో పంచుకోలేమని కేంద్ర అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. అయితే ధర మాత్రమే అడుగుతున్నామని.. సాంకేతికపరమైన అంశాలు వెల్లడించవద్దని చీఫ్ జస్టిస్ గోగోయ్ కోరినా కేంద్రం నో చెప్పింది. దీంతో అదే అఫిడవిట్ దాఖలు చేయాలని కోరుతూ నవంబర్ 14కు విచారణను వాయిదా వేసింది.
సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా పాటించకుండా రాఫెల్ డీల్ బయటపెట్టమని కేంద్రం తాజాగా పేర్కొనడం దేశవ్యాప్తంగా బీజేపీని ఇరకాటంలోకి నెట్టింది. అందరి అనుమానాలను నిజం చేస్తూ రాఫెల్ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్న ప్రతిపక్షాల మాటలకు కేంద్రం తీసుకున్న నిర్ణయం బలాన్నిచ్చినట్లయింది. మరి దీనిపై కాంగ్రెస్ ఏం చేస్తుంది.? ఎన్నికల వేళ బీజేపీకి రాఫెల్ దెబ్బ పడుతుందా అనేది వేచిచూడాల్సిందే.