Telugu Global
NEWS

అలిపిరిలో చంద్రబాబును లేపేందుకు భువనేశ్వరి కుట్ర చేసిందంటే ఎలా ఉంటుంది?

జగన్‌ను హత్య చేసి ముఖ్యమంత్రి అయ్యేందుకు జగన్‌ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలనే కుట్ర చేశారంటూ టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద ప్రసాద్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లో అత్యంత నీతిమాలిన వ్యక్తులు కూడా ఉంటారన్న దానికి బాబు రాజేంద్ర ప్రసాదే నిదర్శమని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు…. మిగిలిన అందరూ కూడా తనలాగే నీచ రాజకీయం చేస్తారని […]

అలిపిరిలో  చంద్రబాబును లేపేందుకు  భువనేశ్వరి కుట్ర  చేసిందంటే ఎలా ఉంటుంది?
X

జగన్‌ను హత్య చేసి ముఖ్యమంత్రి అయ్యేందుకు జగన్‌ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలనే కుట్ర చేశారంటూ టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద ప్రసాద్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లో అత్యంత నీతిమాలిన వ్యక్తులు కూడా ఉంటారన్న దానికి బాబు రాజేంద్ర ప్రసాదే నిదర్శమని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.

పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు…. మిగిలిన అందరూ కూడా తనలాగే నీచ రాజకీయం చేస్తారని అనుకుంటున్నారన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేందుకు అసలు టీడీపీ నేతలు కడుపుకు కూడే తింటున్నారా అని ప్రశ్నించారు. బహుశా టీడీపీ నేతలైతే అలాగే చేస్తారేమో అని సుబ్బారెడ్డి మండిపడ్డారు.

బాబు రాజేంద్రప్రసాద్‌ వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. రాజేందప్రప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలను తిరిగి చంద్రబాబు కుటుంబానికి అన్వయిస్తే……… అలిపిరి దాడిలో చంద్రబాబును చంపేందుకు ప్రయత్నించింది నక్సలైట్లు కాదు… ముఖ్యమంత్రి పీఠం కోసం చంద్రబాబు భార్య భువనేశ్వరే ప్లాన్ చేయించారు అంటే ఎవరైనా ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. అలాంటి ఆరోపణలు చేసే నీచమనస్తత్వం తమకు లేదన్నారు. కానీ ఎదుటివారిని ఒక మాట అంటే వారు ఎంతగా బాధపడుతారన్నది ఆలోచన చేసుకోవాలన్నారు. చంద్రబాబు, ఆయన మనుషులు నోరు అదుపులో పెట్టుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నామన్నారు.

ముఖ్యమంత్రి పీఠానికి ఎసరు వస్తుందని భావిస్తే, లోకేష్ వల్లే ఎసరు వస్తుందని భావిస్తే ఇలాంటి కోడి కత్తితోనే లోకేష్‌ను కూడా లేపేయాలని ఆలోచించే వ్యక్తి చంద్రబాబు అని మేము ఆరోపిస్తే అంగీకరిస్తారా? అని విజయసాయిరెడ్డి విమర్శించారు.

చంద్రబాబు వ్యక్తిత్వం అలాంటిదన్నారు. అలాంటి ఆలోచనలు ఉండబట్టే బాబు రాజేందప్రసాద్‌ చేత విజయమ్మ, షర్మిలపైన అనుచిత వ్యాఖ్యలు చేయించారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ మృతదేహానికి పంచనామా కూడా జరగకుండా అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. అలాంటి మనిషి కాబట్టే రాజేందప్రసాద్‌ చేత అడ్డగోలుగా మాట్లాడించారన్నారు.

First Published:  30 Oct 2018 2:09 AM GMT
Next Story