Telugu Global
NEWS

ముంబై వన్డేలో టీమిండియా పరుగుల హోరు

రోహిత్ శర్మ, అంబటి రాయుడు సెంచరీల జోరు 150 స్కోర్లలో రోహిత్ శర్మ రికార్డు ముంబై వన్డేలో టీమిండియా సెంచరీల జోరు, పరుగుల హోరుతో చెలరేగిపోయింది. ప్రత్యర్థి ఎదుట 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. బ్రబోర్న్ స్టేడియం వేదికగా ప్రారంభమైన ఈమ్యాచ్ లో టాస్ నెగ్గి…ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న టీమిండియా 50 ఓవర్లలో 5 వికెట్లకు 377 పరుగుల భారీస్కోరు సాధించింది. కెప్టెన్ విరాట్ కొహ్లీ విఫలమైనా… ఓపెనర్ రోహిత్ శర్మ, రెండోడౌన్ అంబటి రాయుడు […]

ముంబై వన్డేలో టీమిండియా పరుగుల హోరు
X
  • రోహిత్ శర్మ, అంబటి రాయుడు సెంచరీల జోరు
  • 150 స్కోర్లలో రోహిత్ శర్మ రికార్డు

ముంబై వన్డేలో టీమిండియా సెంచరీల జోరు, పరుగుల హోరుతో చెలరేగిపోయింది. ప్రత్యర్థి ఎదుట 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. బ్రబోర్న్ స్టేడియం వేదికగా ప్రారంభమైన ఈమ్యాచ్ లో టాస్ నెగ్గి…ముందుగా బ్యాటింగ్ ఎంచుకొన్న టీమిండియా 50 ఓవర్లలో 5 వికెట్లకు 377 పరుగుల భారీస్కోరు సాధించింది.

కెప్టెన్ విరాట్ కొహ్లీ విఫలమైనా… ఓపెనర్ రోహిత్ శర్మ, రెండోడౌన్ అంబటి రాయుడు స్ట్రోక్ ఫుల్ సెంచరీలు సాధించడంతో… టీమిండియా మ్యాచ్ విన్నింగ్ స్కోరు నమోదు చేయగలిగింది. వన్డే క్రికెట్ హిట్ మాన్ రోహిత్ శర్మ 162 పరుగుల స్కోరుతో…21వ సెంచరీ సాధించగా…తెలుగుతేజం అంబటి రాయుడు…8 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 100 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు.

రోహిత్ 21వ శతకం

టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ….ముంబై వన్డేలో భారీ సెంచరీతో పరుగుల మోత మోగించాడు. కేవలం 98 బాల్స్ లోనే 13 బౌండ్రీలు, ఓ భారీ సిక్సర్ తో సెంచరీ మార్క్ చేరిన రోహిత్… ఆ తర్వాత భారీస్ట్రోక్ లతో విరుచుకుపడ్డాడు. అంబటి రాయుడుతో కలసి మూడో వికెట్ కు డబుల్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశాడు. చివరకు 137 బాల్స్ లో 20 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 162 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు.

వన్డే క్రికెట్లో…150కి పైగా స్కోర్లు సాధించడం…బ్యాట్ మాన్ రోహిత్ శర్మకు ఇది ఏడవసారి. ప్రస్తుత సిరీస్ లో భాగంగా గౌహతీలో ముగిసిన తొలివన్డేలో 152 పరుగుల స్కోరు సాధించిన రోహిత్…ముంబై వన్డేలో 162 పరుగులు సాధించడం విశేషం. ప్రస్తుత నాలుగో వన్డే వరకూ ఆడిన 192 మ్యాచ్ ల్లో…21 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలతో 7వేల 300కు పైగా పరుగులు సాధించాడు.

అంబటి రాయుడు మూడో శతకం….

విండీస్ తో నాలుగో వన్డేలో …టీమిండియా రెండో డౌన్ ఆటగాడు, తెలుగుతేజం అంబటి రాయుడు మెరుపు సెంచరీ సాధించాడు. ఓపెనర్ రోహిత్ శర్మతో కలసి మూడో వికెట్ కు డబుల్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేయడంలో ప్రధానపాత్ర వహించాడు.

రాయుడు కేవలం 80 బాల్స్ లోనే 8 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 100 పరుగులు చేసి అవుటయ్యాడు. తన కెరియర్ లో 43వ వన్డే మ్యాచ్ లో పాల్గొన్న రాయుడుకి 3 శతకాలు….9 హాఫ్ సెంచరీలు సాధించిన రికార్డు ఉంది.

తనకు లభించిన పరిమిత అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకొన్న రాయుడు…1447 పరుగులు సాధించాడు.

రోహిత్ శర్మ 150 స్కోర్ల రికార్డు….

టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ…వన్డే క్రికెట్లో తన అసాధారణ రికార్డులను కొనసాగిస్తున్నాడు. పరుగుల హోరు, సెంచరీల జోరుతో తనకు తానే సాటిగా దూసుకుపోతున్నాడు.

గౌహతీ వేదికగా…వెస్టిండీస్ తో ముగిసిన తొలివన్డేలో 152 పరుగుల స్కోరుతో నాటౌట్ గా నిలవడం ద్వారా…మాస్టర్ సచిన్ టెండుల్కర్ పేరుతో ఉన్న ఐదు 150 స్కోర్ల రికార్డును తెరమరుగు చేశాడు.

అంతేకాదు…ముంబై వేదికగా జరిగిన నాలుగో వన్డేలో సైతం రోహిత్ మరో భారీ సెంచరీ నమోదు చేశాడు.. ఏకంగా 162 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మ సాధించిన మొత్తం 21 సెంచరీలలో ఏడు 150కి పైగా స్కోర్లు ఉండటం విశేషం.

మూడు డబుల్ సెంచరీల ఒకే ఒక్కడు….

2013లో బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియా పై 209, కోల్ కతా వేదికగా 2014లో శ్రీలంకపై 264 పరుగులు, 2015లో కాన్పూర్ వేదికగా సౌతాఫ్రికా పై 150 స్కోరు, 2016లో పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా పై 171 నాటౌట్ స్కోరు, 2017లో మొహాలీ వేదికగా శ్రీలంకపై 208, వెస్టిండీస్ తో గౌహతీ వేదికగా ముగిసిన తొలివన్డేలో 152 పరుగుల నాటౌట్ స్కోరు రికార్డులను కేవలం రోహిత్ శర్మ మాత్రమే సాధించాడు. వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన భారత ఏకైక క్రికెటర్ కూడా రోహిత్ శర్మే కావడం మరో రికార్డు.

First Published:  30 Oct 2018 2:07 AM IST
Next Story