Telugu Global
NEWS

మహిళా అధికారి చేత బలవంతంగా డ్రైనేజీ క్లీన్‌ చేయించిన టీడీపీ ఎమ్మెల్యే

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే వర్మ రెచ్చిపోయారు. ఒక మహిళా అధికారిణి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. దీంతో ఆమె సెలవుపై వెళ్లింది. మరోసారి వర్మ తన జోలికి వస్తే ఆత్మహత్య చేసుకుంటానని వాపోతోంది. గొల్లప్రోలు మున్సిపాటీలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న శివలక్ష్మీతో వర్మ దురుసగా ప్రవర్తించారు. వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్యే డ్రైనేజీని సరిగా శుభ్రం చేయలేదని శివలక్ష్మీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా స్థానికుల సమక్షంలోనే ఆమెను బూతులు తిడుతూ రెచ్చిపోయారు. ఆమెను దూషిస్తూ […]

మహిళా అధికారి చేత బలవంతంగా డ్రైనేజీ క్లీన్‌ చేయించిన టీడీపీ ఎమ్మెల్యే
X

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే వర్మ రెచ్చిపోయారు. ఒక మహిళా అధికారిణి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. దీంతో ఆమె సెలవుపై వెళ్లింది. మరోసారి వర్మ తన జోలికి వస్తే ఆత్మహత్య చేసుకుంటానని వాపోతోంది. గొల్లప్రోలు మున్సిపాటీలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న శివలక్ష్మీతో వర్మ దురుసగా ప్రవర్తించారు. వార్డుల్లో పర్యటించిన ఎమ్మెల్యే డ్రైనేజీని సరిగా శుభ్రం చేయలేదని శివలక్ష్మీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతటితో ఆగకుండా స్థానికుల సమక్షంలోనే ఆమెను బూతులు తిడుతూ రెచ్చిపోయారు. ఆమెను దూషిస్తూ బలవంతంగా అందరి సమక్షంలో మురుగు కాలువలోకి చేతులు పెట్టించి మురుగు మట్టిని ఎత్తించారు. సిబ్బందిని పిలిస్తానని చెప్పినా వినలేదు. ఆమె చేతిలోని సెల్‌ఫోన్‌ను లాగేశారు ఎమ్మెల్యే.

ఈ అవమానంతో మనస్తాపం చెందిన శివలక్ష్మీ సెలవుపై వెళ్లిపోయారు. ఎమ్మెల్యే వర్మ తనకు చేసిన అవమానంపై ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని శివలక్ష్మీ కన్నీరు పెట్టుకున్నారు. మళ్లీ తన జోలికి వస్తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరికలు కూడా చేశారు. నలభై వేల మంది జనాభా కలిగిన గొల్లప్రోలు మున్సిపాలిటీలో 60 మంది శానిటరీ సిబ్బంది ఉండాలి…. కానీ 32 మంది మాత్రమే ఉన్నారని ఆమె వివరించారు. దీని వల్ల ఇబ్బందులు వస్తున్నాయని.. దానికి తానేం చేయమంటారని ప్రశ్నించారు.

First Published:  29 Oct 2018 11:40 PM GMT
Next Story