సోమిరెడ్డిని ఉతికి ఆరేసిన కాకాణి
జగన్ హత్యకు తాము ప్లాన్ చేస్తే గిచ్చుకోవడం, గిల్లు కోవడం ఉండదంటూ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సోమిరెడ్డిపై పంచ్‌లతో విరుచుకుపడ్డారు. సోమిరెడ్డి గురించి ఆయనేమన్నారంటే…. ”మన బ్రూస్‌లీ( సోమిరెడ్డి). అబ్బా.. అబ్బా.. తాండ్రపాపరాయుడంత ఫిగర్, కోడి రామ్మూర్తి అంత కౌటౌట్, ప్రకాశం పంతులంత గుండెకాయ ఉన్నోడు. సోమిరెడ్డి గుండు సూదికి ఎక్కువ, గుడ్డలు కుట్టే సూదికి తక్కువ. నీ […]
జగన్ హత్యకు తాము ప్లాన్ చేస్తే గిచ్చుకోవడం, గిల్లు కోవడం ఉండదంటూ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సోమిరెడ్డిపై పంచ్‌లతో విరుచుకుపడ్డారు. సోమిరెడ్డి గురించి ఆయనేమన్నారంటే….
”మన బ్రూస్‌లీ( సోమిరెడ్డి). అబ్బా.. అబ్బా.. తాండ్రపాపరాయుడంత ఫిగర్, కోడి రామ్మూర్తి అంత కౌటౌట్, ప్రకాశం పంతులంత గుండెకాయ ఉన్నోడు.
సోమిరెడ్డి గుండు సూదికి ఎక్కువ, గుడ్డలు కుట్టే సూదికి తక్కువ. నీ బతుక్కు మర్డర్ ప్లానా…. ప్రభుత్వ పథకాల్లో డబ్బులు కొట్టేసే ప్లాన్ లు చేయడానికి పనికివస్తావు గానీ…. నీ బతుక్కు మర్డర్ ప్లానా?
మాట్లాడే వాళ్ళకు సభ్యతా సంస్కారం ఉండాలి. అవి నీకు లేవు. అందుకే నోరు పారేసుకుంటుంటావు. అది చూసే చంద్రబాబు నీకు మంత్రి పదవి ఇచ్చాడు. చంద్రబాబుకు పరిపాలన చేసేవాళ్ళు అక్కరలేదు. సోమిరెడ్డి లాగా సోది మాట్లాడేవాళ్ళు, జగన్ ను తిట్టేవాళ్ళు కావాలి. నీకు మంత్రి పదవి ఇచ్చాడంటే అది జగన్ పుణ్యమే. కాబట్టి సోమిరెడ్డీ…. ఇంట్లో జగన్ ఫొటో పెట్టుకుని రోజూ దండం పెట్టుకో. బహుశా ఆ పని నువ్వు ఇప్పటికే చేస్తూ ఉంటావు….
ఈ మధ్య కారులో పోతుంటే, కారు పక్కకు లాగితే గుండెకాయ పేలినంత పనైపోయింది నీకు. సిబ్బందిని అడిగితే టైర్ పగల్లేదు.. ఏమీ పగల్లేదు. టైర్ పంక్చర్ అయింది. బండి పక్కకు లాగింది. దానికే సోమిరెడ్డి కంగారుపడి కారు దిగిపోయి చెట్ల చాటుకు వెళ్లి తడిసిన ఫ్యాంటును మార్చుకుని వచ్చాడని చెప్పారు. వాట్సాప్‌లో మాత్రం తృటిలో ప్రాణాపాయం తప్పిందని ప్రచారం చేసుకున్నాడు.
టైర్ పంక్చర్ అయితేనే గుండె పగిలే నీకు అవసరమా మర్డర్ ప్లాను? కోడి గుండెకాయేసుకుని తిరిగే నీకు అవసరమా. టీడీపీలో నీ బతుకంతా గిచ్చుకోవడాలు, గిల్లుకోవడాలతోనే సాగుతోంది. నీ సొంత పార్టీలోనే నీ పని అదే కదా! అందరినీ గిచ్చుకుంటూ, గిల్లుకుంటూ బతుకుతున్నావు.
గట్టిగా గాలి వస్తే ఎగిరిపోయే పర్సనాలిటీ నీది…. నీ బతుక్కి మర్డర్ ప్లాన్లు కూడానా? ఈ మధ్య వరిపొలాలు చూడ్డానికి పోయాడు. గాలి రాగానే గట్టు మీద నుంచి పడిపోయాడు. గన్‌మెన్లు తలా ఓ చేయి వేసి బయటకు ఎత్తుకొచ్చారు. గట్టిగా గాలొస్తే నలుగురు పట్టుకోవాలి నిన్ను…. అలాంటి ఆయన జగన్ మర్డర్‌కు ప్లాన్ చేస్తాడట. నీ గుండెకాయ కోడి గుండెకాయంత ఉంటుంది. అది ఎక్కడుందో బాడీలో వెతుక్కోవాలి.
నిన్ను చూసి జనం సిగ్గుపడుతున్నారు. నెల్లూరు జిల్లా పరువు తీస్తున్నావు నువ్వు. అగ్రికల్చర్ మినిస్టర్ కాదు ”అగ్లి కల్చర్ మినిస్టర్” అంటున్నారు. ఏమన్నా అంటే నాకున్న ట్రాక్ రికార్డు జిల్లాలో ఎవరికీ లేదని చెప్పుకుంటావ్. నిజమే ఇన్నిసార్లు వరుసగా ఓడిపోయిన రికార్డు జిల్లాలో ఎవరికీ లేదు.
కోడికాళ్లు వేసుకుని… కనీసం పాదం కూడా సరిగా పడదూ… గట్టిగా అరిస్తే ఫ్యాంటు తడుపుకుని పారిపోతావ్. జగన్‌ను తిట్టడమే నీకున్న అర్హత. అందుకే మంత్రి పదవి వచ్చింది. జగన్ ఫొటో పెట్టుకుని పూజ చేసుకో. అసలు సోమిరెడ్డి గడ్డం ఎందుకు పెంచారో తెలుసా. గతంలో ఒకసారి రైల్వే స్టేషన్‌లో దిగగానే కార్యకర్తలంతా పూలదండలు తెచ్చి గన్‌మెన్లకు వేశారు. తాము కాదు…. సార్ పక్కన ఉన్నాడని గన్‌మెన్లు చెప్పాల్సి వచ్చింది. అప్పటి నుంచి పెద్దగా కనిపించేందుకు గడ్డం పెంచుకుని తిరుగుతున్నావు. అలాంటి నువ్వు జగన్‌ను మర్డర్ చేస్తావా?
ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడినందుకే సర్వేపల్లి ప్రజలే మూడుసార్లు ఫినాయిల్ వేసి నీ నోరు కడిగారు. ఈసారి యాసిడ్ పోసి కడుగుతారు” అని సోమిరెడ్డిపై కాకిణి గోవర్దన్ రెడ్డి ఫైర్ అయ్యారు. జగన్ ఏనుగు లాంటి వాడు అయితే సోమిరెడ్డి దోమ లాంటి వ్యక్తి అని విమర్శించారు.
- #BewareofYellowMedia420 chandrababu naiduA1 chandrababu naiduABNabn andhrajyothyabn radha krishnaalzheimer diseasealzheimer's disease definitionalzheimersalzheimers CBNalzheimers chandrababualzheimers chandrababu naiduAndhra Politicsandhra pradesh 2014 scamsandhra pradesh 2015 scamsandhra pradesh 2016 scamsandhra pradesh 2017 scamsandhra pradesh 2018 scamsandhra pradesh district newsandhra pradesh news papersandhra pradesh politicsandhra pradesh scamsandhra pradesh u turn anculeandhrajyothy paperap 24x7 newsAP CM Chandrababu Naiduap corruption kingap news papersap u turn anculeBeware of YellowMediaBJPCASH FOR VOTECBNCBN alzheimersCBN nippucbn vennupotuCBN vote for note casechandrababu alzheimerschandrababu mediaChandrababu Naiduchandrababu naidu 420chandrababu naidu alzheimer diseasechandrababu naidu amaravatichandrababu naidu amaravati land scamchandrababu naidu capitalchandrababu naidu capital citychandrababu naidu commentschandrababu naidu corruption kingchandrababu naidu dalitschandrababu naidu fourth genderchandrababu naidu nippuchandrababu naidu petentchandrababu naidu polavaram projectchandrababu naidu polavaram scamchandrababu naidu politicschandrababu naidu scamschandrababu naidu singapore mental hospitalchandrababu naidu speecheschandrababu naidu tongue slipchandrababu naidu vennupotuchandrababu naidu vennupotu politicschandrababu naidu worst administrationchandrababu naidu yellow mediachandrababu naidupolitical strategieschandrababu yellow mediacomedy newsCONgressdirty mediadramoji raoEenadueenadu groupeenadu paperelectronic mediaEnglish national newsenglish news papersenglish news portalserragadda mental hospitaletvetv indiaFacebookfilm newsfourth genderGenral newshistory newsIndian Mediaindian news papersInstagramInternational newsInternational telugu newsKakani Govardhan Reddykakani govardhan reddy setaireskakani govardhan reddy setaires on somireddy chandramohan reddymahaa newsmaro praja prasthanamMediamodi transgendernational mediaNational newsNational PoliticsNational telugu newsNewsnews papersnippunippu naiduntr chandrababu naiduNTVpetentpolitical news teluguPraja Sankalpa YatraPublic newsRadha KrishnaRamoji Raosakshi groupSakshi MediaSakshi PaperSakshi tvsetairessingapore mental hospitalSocial Mediasocial media newssocial media platformsocial media publicitySomireddy Chandramohan Reddystreem mediastudio NTDPtdp chandrababu naidutdp mediatdp radha krishnatdp ramoji raoTDP Scamstelangana cash for votetelangana district newsTelangana Politicstelangana vote for note caseTelugutelugu cinema newsTelugu Comedytelugu comedy newstelugu crimetelugu crime newstelugu crimestelugu global crime newstelugu global english news portaltelugu global newstelugu global news portaltelugu global telugu news portaltelugu historical newstelugu historical placestelugu historytelugu history newsTelugu international newsTelugu MediaTelugu national newsTelugu NewsTelugu News Channelstelugu news paperstelugu news upatestelugu normal newsTelugu political newstelugu political partiestelugu politicstelugu politics newstelugu rajakiyaluteluguglobal.comteluguglobal.intollywood latest newsTRStupputuppu CBN tuppuTV9TwitterU turnu turn anculevemuri radha krishnavennupotuvennupotu petentvennupotu politicsvote for note A1Vote For Note Casevote for note case A1web mediaworst cm chandrababu naiduworst mediaY. S. Rajasekhara ReddyY. S. VijayammaycpYeduguri Sandinti Jaganmohan ReddyYeduguri Sandinti Rajasekhara ReddyYeduguri Sandinti SharmilaYeduguri Sandinti Sharmila ReddyYeduguri Sandinti VijayammaYellow Mediayellow papersyellow radha krishnayellow ramoji raoyerawada mental hospitalYS Jaganys jagan knife attackys jagan padayatraYS Jagan Praja Sankalpa YatraYS Jaganmohan Reddyys rajasekhara reddyYS Sharmilays sharmila padayatrays vijayammaYSJysrYSR Congress Partyysr padayatraysr praja prasthanamYSRCPYuvajana Shramika Rythu Congress Party