ఉత్తమ్ ను సీఎంగా చూడటమే లక్ష్యమట
తెలంగాణ ఎన్నికలు ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే సాగుతున్నాయి. మహా కూటమిలో కాంగ్రెస్ దే ప్రధాన భూమిక. ఈ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆశపడుతున్న ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ కు కాస్త రిలీఫ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారట ఆయన సతీమణి పద్మావతి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం రేసులో ఉండే నాయకుల్లో ప్రథమ స్థానంలో ఉంటారట ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రస్తుతం పార్టీ బాధ్యతలను […]
తెలంగాణ ఎన్నికలు ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే సాగుతున్నాయి. మహా కూటమిలో కాంగ్రెస్ దే ప్రధాన భూమిక. ఈ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆశపడుతున్న ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ కు కాస్త రిలీఫ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారట ఆయన సతీమణి పద్మావతి.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం రేసులో ఉండే నాయకుల్లో ప్రథమ స్థానంలో ఉంటారట ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రస్తుతం పార్టీ బాధ్యతలను కూడా అదే స్థాయిలో మోస్తున్నారని…. అభ్యర్థుల ఎంపిక, అలకలు, బుజ్జగింపులు, కొత్తగా పార్టీలో చేరే వారిని ఆహ్వానించడం, కూటమిలోని టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలకు సీట్ల కేటాయింపు, ప్రత్యర్థి పార్టీల వ్యవహార శైలిపైనా కన్నేసి ఉంచడం ఇలా ఒకటేమిటి క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారని చెబుతున్నారు ఆయన సతీమణి.
ఉత్తమ్ కష్టాన్ని గమనించిన ఆయన సతీమణి పద్మావతి కొన్ని బాధ్యతలను ఆమె భుజాలపై వేసుకున్నారు. పార్టీ వ్యవహారాలు, సభల ఏర్పాటు, సోషల్ మీడియా బాధ్యతలను చూస్తున్నారు. ఉత్తమ్ గత ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు కూడా ఆయనే అభ్యర్థి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే, పద్మావతి కూడా కోదాడ తాజా మాజీ ఎమ్మెల్యే. ఆమె కూడా ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.
ఒకవైపు తన భర్త ఉత్తమ్ నియోజకవర్గ బాధ్యతలను చూసుకుంటూనే, మరోవైపు కోదాడలోనూ పద్మావతి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఒకవైపు ఆమె బిజీగా గడుపుతూనే, ఉత్తమ్ ను కొన్ని సమస్యల నుంచి బయటపడేసేందుకు చేదోడు వాదోడుగా వ్యవహరిస్తున్నారు.
హుజూర్ నగర్ ప్రచార బాధ్యతలను మొత్తం తన భుజస్కంధాలపై వేసుకొని నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ అన్నీ తానై వ్యవహరిస్తున్నారట. ఉత్తమ్ ను సీఎంగా చూడటమే ఆమె లక్ష్యంగా పెట్టుకున్న ఆమె పడుతున్న కష్టం నెరవేరుతుందో లేదో చూడాలి మరి.