Telugu Global
NEWS

రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట...

రేవంత్ రెడ్డి.. ఓటుకు నోటు కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు.. ఈ మధ్య ఐటీ దాడులు, ఆ తర్వాత ఈడీ విచారణతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. కేసీఆర్ కు ధీటైన ప్రత్యర్థిగా తిట్ల వర్షం కురిపిస్తూ గులాబీ పార్టీకి టార్గెట్ గా మారారు. కేసీఆర్ ను తిడుతున్న తిట్లు చూసి ఈయనకు ఎన్నో బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయట.. తన ప్రాణాలకు కూడా ముప్పు ఉందని చాలా సార్లు చెప్పాడు. కానీ సడన్ […]

రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట...
X

రేవంత్ రెడ్డి.. ఓటుకు నోటు కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు.. ఈ మధ్య ఐటీ దాడులు, ఆ తర్వాత ఈడీ విచారణతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. కేసీఆర్ కు ధీటైన ప్రత్యర్థిగా తిట్ల వర్షం కురిపిస్తూ గులాబీ పార్టీకి టార్గెట్ గా మారారు. కేసీఆర్ ను తిడుతున్న తిట్లు చూసి ఈయనకు ఎన్నో బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయట.. తన ప్రాణాలకు కూడా ముప్పు ఉందని చాలా సార్లు చెప్పాడు. కానీ సడన్ గా ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం ఈయనకు సెక్యూరిటీ తగ్గించేసింది. దీనిపై హైకోర్టు కెక్కారు రేవంత్ రెడ్డి.

తాజాగా రేవంత్ పిటీషన్ ను విచారించిన కోర్టు రేవంత్ రెడ్డికి భద్రతను పెంచాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. 4+4 సీఆర్ పీఎఫ్ పోలీసుల రక్షణను కల్పించాలని సూచించింది.

రాజకీయంగా తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవంత్ బద్ధ శత్రువుగా మారారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ శ్రేణులంతా రేవంత్ పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.

ప్రచారపర్వంలో దూసుకెళ్దామనుకుంటున్న రేవంత్ కు భద్రత అంతగా లేదు. దీంతో ఆయన ధైర్యంగా ముందడుగు వేయడం లేదు. అందుకే భద్రత పెంచాలని హైకోర్టుకెక్కారు…. కోర్టు ఆదేశాలతో ఇప్పుడు భద్రత వచ్చేసింది. దీంతో మరింత దూకుడుగా ప్రచార పర్వంలోకి వెళ్ళాలని రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారట.

రేవంత్ కు భద్రత పెంపుతో ఆయన తెలంగాణ వ్యాప్తంగా ప్రచారానికి వ్యూహ రచన చేస్తున్నాడు. అలాగే కోడంగల్ లో కూడా తనను ఓడించేందుకు పథకం పన్నిన కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో ప్రచారంలోకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు. మరి ఈ వ్యవహారం వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి మరి.

First Published:  29 Oct 2018 4:40 AM GMT
Next Story