Telugu Global
Health & Life Style

వంట గదికి నిమ్మ చికిత్స

మనం తరచూ నిమ్మ కాయలను ఉపయోగిస్తుంటాం. అయితే వాడేసిన తర్వాత వాటిని డస్ట్‌బిన్‌లలో పడేస్తుంటాం. అయితే వాడేసిన నిమ్మ చెక్కలతోనూ అనేక ఉపయోగాలున్నాయి.   – వంట ఇల్లు అంటే పురుగులు, చీమలు, బొద్దింకలు ఇతర అనేక రకాల కీటకాలు వస్తుంటాయి. అయితే వంటింట్లో ఇలా పురుగులు కనిపించే మూలల వద్ద, కిటికీల్లోనూ వాడేసిన నిమ్మ చెక్కలను ఉంచి చూడండి. పురుగులన్నీ మాయం.  – వంట ఇంట్లో అనేక రకాల వాసనలు వస్తుంటాయి. వండుతున్నపుడు వచ్చే ఘుమఘుమలు మామూలే […]

వంట గదికి నిమ్మ చికిత్స
X
మనం తరచూ నిమ్మ కాయలను ఉపయోగిస్తుంటాం. అయితే వాడేసిన తర్వాత వాటిని డస్ట్‌బిన్‌లలో పడేస్తుంటాం. అయితే వాడేసిన నిమ్మ చెక్కలతోనూ అనేక ఉపయోగాలున్నాయి.
– వంట ఇల్లు అంటే పురుగులు, చీమలు, బొద్దింకలు ఇతర అనేక రకాల కీటకాలు వస్తుంటాయి. అయితే వంటింట్లో ఇలా పురుగులు కనిపించే మూలల వద్ద, కిటికీల్లోనూ వాడేసిన నిమ్మ చెక్కలను ఉంచి చూడండి. పురుగులన్నీ మాయం.
– వంట ఇంట్లో అనేక రకాల వాసనలు వస్తుంటాయి. వండుతున్నపుడు వచ్చే ఘుమఘుమలు మామూలే కానీ ఆ తర్వాత పాడైపోయిన కూరగాయలు ఇతర వ్యర్థాల నుంచి వచ్చే వాసనలు మనం తట్టుకోలేం. అలాంటపుడు వాడేసిన నిమ్మ చెక్కలను ఓ గిన్నెడు నీళ్లలో వేసి మరిగించాలి. అలా మరిగిన నీటి నుంచి వచ్చే సువాసనలు దుర్వాసనను దూరం చేస్తాయి.
– ఫ్రిజ్, ఓవెన్ నుంచి కూడా దుర్వాసనలు వస్తుంటాయి. ఒక చిన్న కప్పులో నీళ్లు పోసి ఓ నిమ్మకాయ ముక్క అందులో ఉంచితే ఇక ఫ్రిజ్, ఓవెన్‌లు ఫ్రెష్ అయిపోతాయి.
– పొయ్యి, పెనం, కూర గిన్నెలలో సాధారణంగా నూనె మరకలు అంత త్వరగా పోవు. కానీ వాటి మీద కొంచెం ఉప్పు చల్లి నిమ్మ చెక్కతో రుద్దితే నూనె మరకలు ఇట్టే పోతాయి.
First Published:  29 Oct 2018 2:55 AM IST
Next Story